Ashleigh Barty: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్.. రిటైర్మెంట్ చేస్తున్నట్లు వీడియో విడుదల..
Ashleigh Barty Retires: ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లీ బార్టీ తన కెరీర్‌లో మూడు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది.
Ashleigh Barty Retires: ప్రపంచ నంబర్ వన్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఆష్లీ బార్టీ((Asleigh Barty)) రిటైర్మెంట్ ప్రకటించింది. ఆస్ట్రేలియాకు చెందిన బార్టీ ఇంతకుముందు కూడా టెన్నిస్ విరామం తీసుకున్నప్పటికీ, ఈసారి తిరిగి రావడానికి సిద్ధంగా లేనని ప్రకటించింది. సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసి, ఈ నిర్ణయాన్ని అభిమానులకు తెలిపింది. ఆస్ట్రేలియా క్రీడా ప్రపంచంలో కీలక ప్లేయర్‌గా బార్టీ నిలిచిందనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్((Australian Open)) టైటిల్‌ను గెలుచుకుంది. 44 ఏళ్ల తర్వాత ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆమె నిలిచింది.
బార్టీ ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె పదవీ విరమణ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అభిమానులతో పాటు, టెన్నిస్ ప్రపంచంలోని ప్రముఖులందరూ ఆమె నిర్ణయం పట్ల చాలా ఆశ్చర్యపోయారు. తన సన్నిహితురాలు, జర్నలిస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, బార్టీ తన టెన్నిస్ కెరీర్‌ను ముగించుకుంటున్నట్లు ప్రకటించింది. బార్టీ తన కెరీర్‌లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది.
ఇంతకుముందే రిటైర్మెంట్ నిర్ణయం..
25 ఏళ్ల బార్టీ, అంతర్జాతీయ వేదికపై అగ్రస్థానంలో నిలవడానికి తన శరీరం సహకరించడం లేదని వీడియోలో వెల్లడించింది. తాను హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోలేదని, గతేడాది వింబుల్డన్ నుంచి రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నానని పేర్కొంది. వీడియోలో బార్టీ మాట్లాడుతూ, ‘నేను రిటైర్మెంట్ గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. నా కెరీర్‌లో ముఖ్యమైన క్షణాలు చాలా ఉన్నాయి. గతేడాది వింబుల్డన్ నాలో ఎన్నో మార్పుల తెచ్చింది. ఇది నా కల’ అని పేర్కొంది.
ఇకపై సిద్ధంగా ఉండలేను..
ఇకపై తాను నంబర్ వన్‌గా ఉండేందుకు సిద్ధంగా లేనని బార్టీ తెలిపింది. 25 ఏళ్ల ఈ స్టార్ మాట్లాడుతూ, ‘నాకు ఇకపై ఆ బలం, సంకల్పం లేదని నా జట్టుకు చాలాసార్లు చెప్పాను. నేను శారీరకంగా నన్ను నేను సిద్ధం చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఇంకేమీ చేయలేను. నేను ఈ గేమ్‌కు నా సర్వస్వం ఇచ్చాను. దానితో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదే నాకు నిజమైన విజయం’ అని పేర్కొంది.
View this post on Instagram
Also Read: