Cow Viral Video: ఈ ఆవు తెలివికి హ్యాట్సాఫ్..! నీళ్లు తాగడం అయిపోగానే కొమ్ములతో ట్యాప్ బంద్‌చేసి..(వీడియో)
ఎండాకాలం ప్రారంభమైంది.. అప్పుడే భానుడు తన భగభగలు చూపిస్తున్నాడు. ఎండా కాలం వచ్చిందంటే సహజంగానే నీటి కొరత ఏర్పడుతుంది. గుక్కెడు నీళ్ల కోసం మానవులే కాదు మూగ జీవాలు సైతం అల్లాడుతుంటాయి.
ఎండాకాలం ప్రారంభమైంది.. అప్పుడే భానుడు తన భగభగలు చూపిస్తున్నాడు. ఎండా కాలం వచ్చిందంటే సహజంగానే నీటి కొరత ఏర్పడుతుంది. గుక్కెడు నీళ్ల కోసం మానవులే కాదు మూగ జీవాలు సైతం అల్లాడుతుంటాయి. ఈ క్రమంలో వన్యప్రాణులు వనాల్లో నీళ్లు లేక జనావాసాల్లోకి వస్తుంటాయి. అందుకే కొందరు తమ నివాస స్థలాలవద్ద పక్షులు, మూగ జీవాల నీళ్లు తాగేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తుంటారు. ఇదిలా ఉంటే రోడ్డుపైన అప్పుడప్పుడూ మనకు కొన్ని ఆవులు కనిపిస్తూ ఉంటాయి. అలా రోడ్డుపైన తిరుగుతూ దొరికిన ఆహారం తింటూ ఉంటాయి. తాగాజా ఒక ఆవు అలా వెళ్తూ వెళ్తూ తనకి బాగా దాహం వేసినట్టుంది. అక్కడెక్కడా నీళ్లు కనిపించకపోయేసరికి ఏం చెయ్యాలా అని చూస్తున్న క్రమంలో ఓ ప్రహరీ గోడ దగ్గర ఉన్న నీళ్ల కుళాయిపైన దాని దృష్టి పడింది. అంతే చకచకా అక్కడికి వెళ్లింది. తన కొమ్ములతో నీళ్ల కుళాయి తిప్పింది. కుళాయి లోంచి నీళ్లు వచ్చాయి.. హమ్మయ్య… అనుకొని తన దాహం తీర్చుకుంది. తను నీళ్లు తాగడం అయిపోగానే కుళాయిని అలాగే వదిలేయలేదు. మళ్లీ యథాప్రకారం తన కొమ్ములతో కుళాయి కట్టేసి అక్కడినుంచి వెళ్లిపోయింది. చూడండి మూగ జీవి అయినా ఎంత బాధ్యతగా వ్యవహరించిందో.. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో. ఈ వీడియో చూస్తున్న వేలమంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ రోజుల్లో కళ్లెదుటే నీళ్లు వృథాగా పోతున్నా కొందరు పట్టించుకోరు. అలాంటి వారికి ఈ ఆవు కనువిప్పు కలిగిస్తోంది అంటున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

