నేడు యడియూరప్పకు బల పరీక్ష.. రెబెల్స్‌పై వేటుతో లైన్ క్లియర్
కర్నాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం అక్కడ బలపరీక్షల కాలం నడుస్తోంది. వారం క్రితమే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. మళ్లీ వారం తిరగక ముందే మరోసారి పరీక్ష నిర్వహించబోతున్నారు. ఇవాళ యడియూరప్ప ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించబోతున్నారు. ప్రభుత్వ మనుగడకు కావాల్సిన మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యేల వెన్నుపోటు, బీజేపీ ఆపరేషన్ నడుమ కుమారస్వామి ప్రభుత్వం కుప్ప కూలింది. సీఎం పీఠం ఎక్కిన 14 నెలలకే కుమారస్వామి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం బీజేపీ నేతృత్వంలో […]
కర్నాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం అక్కడ బలపరీక్షల కాలం నడుస్తోంది. వారం క్రితమే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. మళ్లీ వారం తిరగక ముందే మరోసారి పరీక్ష నిర్వహించబోతున్నారు. ఇవాళ యడియూరప్ప ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించబోతున్నారు. ప్రభుత్వ మనుగడకు కావాల్సిన మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంది.
ఎమ్మెల్యేల వెన్నుపోటు, బీజేపీ ఆపరేషన్ నడుమ కుమారస్వామి ప్రభుత్వం కుప్ప కూలింది. సీఎం పీఠం ఎక్కిన 14 నెలలకే కుమారస్వామి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం బీజేపీ నేతృత్వంలో యడియూరప్ప కర్ణాటక 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎం పీఠంపై కూర్చోడానికి కావాల్సిన సభ్యుల బలం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224 ఉండగా.. రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంతో ఆ సంఖ్య 207కి తగ్గింది. ఈ నెల ఆరో తేదీ వరకు 113గా ఉన్న మేజిక్ ఫిగర్.. ఇప్పుడు 104గా మారింది. అయితే అసెంబ్లీలో ఇప్పటికే 105 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సేఫ్ జోన్‌లో ఉన్నారు యడియూరప్ప.
అయితే బలపరీక్షకు 24 గంటల ముందు.. రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ రమేష్ కుమార్ భారీ షాక్ ఇచ్చారు.14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. వీరంతా కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైనవారు కావడం గమనార్హం. దీంతో అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేల సంఖ్య 17కి చేరింది. తాజాగా అనర్హులుగా ప్రకటించిన వారిలో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే స్పీకర్ నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమౌతున్నారు రెబెల్ ఎమ్మెల్యేలు.