Cyrus Mistry Death Report: సైరస్‌ మిస్త్రీ కారు యాక్సిడెంట్‌పై సంచలన నివేదిక.. రిపోర్ట్‌లో ఏం చెప్పారంటే..

Cyrus Mistry Death Report: టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ యాక్సిడెంట్‌ మిస్టరీ వీడింది. ఈ ప్రమాదానికి రోడ్డు లోపం, అతివేగమే కారణమంటూ..

Cyrus Mistry Death Report: సైరస్‌ మిస్త్రీ కారు యాక్సిడెంట్‌పై సంచలన నివేదిక.. రిపోర్ట్‌లో ఏం చెప్పారంటే..
Cyrus Mistry

Updated on: Sep 18, 2022 | 8:40 AM

Cyrus Mistry Death Report: టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ యాక్సిడెంట్‌ మిస్టరీ వీడింది. ఈ ప్రమాదానికి రోడ్డు లోపం, అతివేగమే కారణమంటూ హాంకాంగ్‌ మెర్సిడెజ్‌ బెంజ్ టీమ్‌ రిపోర్ట్‌ ఇచ్చింది. టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం దేశ కార్పొరేట్ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆయన ప్రయాణించిన కారు యాజమాన్యం మెర్సిడెస్ బెంజ్ అధికారులు సైతం స్పాట్‌కి వచ్చి విచారణ చేపట్టారు. మెర్సిడెస్ బెంజ్ తన ప్రాథమిక రిపోర్టును పోలీసులకు సమర్పించింది. ఈ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించింది. కారు ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు ఏం జరిగింది? ప్రమాదానికి ముందు కారు ఏ వేగంతో ప్రయాణించిది? అనే విషయాలను తెలిపింది.

అంతేకాక హాంకాంగ్‌ నుంచి ముంబైకి మెర్సిడెజ్‌ టీమ్‌ కూడా తన తుది రిపోర్టును విడుదల చేసింది. ఈ కారు ఓవర్ స్పీడు కారణంగానే ప్రమాదానికి గురైందని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ సమర్పించిన రిపోర్టులో కారు ప్రమాదానికి గురి కావడానికి కొన్ని సెకన్ల ముందు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఉందని తెలిపింది. బ్రిడ్జ్ డివైడర్‌ను కారు ఢీకొట్టినప్పుడు గంటకు 89 కిలోమీటర్ల వేగంలో ప్రయాణిస్తున్నట్టు చెప్పింది. కారు క్రాష్ కావడానికి ఐదు సెకన్ల ముందు బ్రేక్‌లను అప్లయి చేసినట్టు మెర్సిడెస్ బెంజ్ రిపోర్టు రాసింది. క్రాష్ అయిన తర్వాత నాలుగు ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. మూడు డ్రైవర్ సీటు వైపువి కాగా.. ఒకటి పక్క సీటుది. అంతేకాక కారు సీటులో వెనుక కూర్చున్న వారు సీటు బెల్టులు పెట్టుకోకపోవడంతో.. మరణించారని చెప్పారు. మరోవైపు రోడ్డు సరిగా లేకపో దీంతో వెనుక సీటులో కూర్చున్న వారికి కూడా సీటు బెల్టులను ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..