Cyclone Remal: ఆ తీరం వెంబడి దూసుకెళ్తున్న రెమాల్ తుఫాన్.. ఈ రాష్ట్రాలకు అలర్ట్

|

May 26, 2024 | 4:13 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. దీనికి రెమాల్ తీవ్ర తుపానుగా నామకరణం చేశారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 7కిలోమీటర్ల వేగంతో ఈ తీవ్ర తుపాను ప్రయాణిస్తోందని చెబుతున్నారు. బంగ్లాదేశ్ - కేపుపారాకు దక్షిణంగా 260 కిలోమీటర్ల దూరంలో.. వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్‎కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉన్నట్లు తెలిపారు.

Cyclone Remal: ఆ తీరం వెంబడి దూసుకెళ్తున్న రెమాల్ తుఫాన్.. ఈ రాష్ట్రాలకు అలర్ట్
Cyclone Remal
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. దీనికి రెమాల్ తీవ్ర తుపానుగా నామకరణం చేశారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 7కిలోమీటర్ల వేగంతో ఈ తీవ్ర తుపాను ప్రయాణిస్తోందని చెబుతున్నారు. బంగ్లాదేశ్ – కేపుపారాకు దక్షిణంగా 260 కిలోమీటర్ల దూరంలో.. వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్‎కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉన్నట్లు తెలిపారు. రెమాల్ తుఫాను ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడునుంన్నట్లు సూచిస్తున్నారు. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలోని సముద్రం మొత్తం అల్లకల్లోలంగా మారింది. తుఫాను గాలి దాటికి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ తీరం వెంబడి గంటకు 95-105 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అత్యధికంగా 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఈరోజు మే 26 అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపూపారా – వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటనున్నట్లు చెప్పారు. తీరం దాటే సమయంలో మరింత విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆ సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. అలాగే అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలుల తీవ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మత్యకారులు, జాలర్లు వేటకు వెళ్లవద్దని ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసింది. 27వ తేదీ వరకు సముద్రంలో వేట నిషిద్దం అని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. తెలంగాణ మీదుగ ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. దీంతో పాటు కేరళ పరిసర ప్రాంతాలపై కూడా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. ఇది పశ్చిమ దిశ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపుగా గాలులు వీస్తున్నట్లు వివరించారు. ఈ ఉపరితల ఆవర్తనంతో ఏపీలో పలుచోట్ల చెదురు మొదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…