Cyclone Remal: ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్‌ తుఫాన్‌ బీభత్సం.. మణిపూర్‌, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదలు.. ఇంఫాల్‌ పరిస్థితి దారుణం

|

May 31, 2024 | 9:22 AM

భారీ వరదలతో ఈశాన్య రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ప్రధానంగా.. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో జనజీవనం స్తంభించింది. నదులన్నీ ఉప్పొంగి ప్రవహించడంతో ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నంబూరి నదితోపాటు, ఇంఫాల్‌ నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా.. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Cyclone Remal: ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్‌ తుఫాన్‌ బీభత్సం.. మణిపూర్‌, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదలు.. ఇంఫాల్‌ పరిస్థితి దారుణం
Floods In Manipur
Follow us on

రెమాల్‌ తుఫాన్‌ సృష్టించిన బీభత్సం నుంచి ఈశాన్య రాష్ట్రాలు తేరుకోవడం లేదు. తుఫాన్‌ ప్రభావంతో మణిపూర్‌, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదలతో తల్లడిల్లుతున్నారు జనం. మణిపూర్‌లో పరిస్థితి ఔట్‌ ఆఫ్‌ కంట్రోల్‌గా తయారైంది. వేలాదిమంది నిరాశ్రయులుగా మారారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి.. వరదలతో జనం ఇంకా రిలీఫ్‌ క్యాంప్‌ల్లోనే ఆశ్రయం తీసుకోవాల్సి వస్తోంది. నంబూరి నదితోపాటు, ఇంఫాల్‌ నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా.. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వరదల కారణంగా మణిపూర్‌లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సేనాపతి జిల్లాలోని వకో గ్రామంలో వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామంతో.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఇక.. వరద ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రజలను బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. స్థానిక కోర్టులలోకి, జడ్జిల నివాసాల్లోకి కూడా వరదనీరు ప్రవేశించింది. చాలా ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

మరో రెండు రోజుల పాటు మణిపూర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హైఅలర్ట్‌ జారీ చేసింది. మణిపూర్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా అపారనష్టం జరిగింది. వందలాది ఇళ్లు కుప్పకూలాయి.

కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలడంతో ప్రాణనష్టం కూడా జరిగింది. మణిపూర్‌లో వరదలపై కేంద్రం కూడా అప్రమత్తమయ్యింది. మణిపూర్‌కు అన్ని విధాలా సాయం చేస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది. అటు.. బెంగాల్ సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుఫాన్‌ సృష్టించిన విధ్వంసంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు. వేలాదిమంది నిరాశృయల‌య్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..