సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆధార్ లింక్ అనో, పాన్‌కార్డ్ లింక్ అనో ఏదో ఒక వంకతో ఓటీపీ చెప్పమని వారి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని, వారి ఖాతాలను కొల్లగొట్టడం పరిపాటైపోయింది. ఇది తెలుసుకున్న వినియోగదారులు అలర్ట్ అయిపోవడంతో కొత్త పంధాను ఎంచుకున్నారు. యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే డబ్బులు వస్తాయంటూ నమ్మించి ఒక వ్యక్తి నుంచి ఏకంగా ఎనిమిదిన్న లక్షలు దొచుకున్నారు. లక్షల్లో డబ్బులు పొగోట్టుకున్న తర్వాత అది ఫేక్ అని తెలిసి లబోదిబోమంటున్నాడు.
గురుగ్రామ్‌కు చెందిన సిమ్రన్ జీత్ సింగ్ నందా అనే వ్యక్తికి ఇటీవల వాట్సప్ లో మెస్సేజ్ వచ్చింది. తాము చెప్పిన వీడియోలను లైక్ చేస్తే ఒక్కో లైక్‌కు 50 రూపాయలు చెల్లిస్తామని, అందుకోసం ముందుగా కొంత డబ్బు మీరు చెల్లించాల్సి ఉంటుందని ఆ మెసేజ్ సారాంశం. అందుకు నందా అంగీకరిస్తూ రిప్లై ఇచ్చాడు. ఆ మర్నాడు ఓ మహిళ నందాకు ఫోన్ చేసి, ఒప్పందం ప్రకారం కొంత డబ్బు పంపాలంటూ నగదు రిక్వెస్ట్ పంపింది. ఆ లింక్‌పై క్లిక్ చేసాడు నందా. ఇంకేముందు దఫదఫాలుగా ఇతని ఎకౌంట్‌నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది.
అలా ఎనిమిదిన్నర లక్షలు అవతలి ఎకౌంట్‌లోకి ఎగిరిపోయాయి. దీంతో మెస్సేజ్ పంపిన వారి సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అవతలినుంచి సమాధానం రాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సిమ్రన్ జీత్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన వీడియోల ద్వారా మాల్ వేర్‌ను వ్యాప్తి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..