Cyber Attack: ఎయిమ్స్‌ తర్వాత ఐసీఎంఆర్‌పై సైబర్‌ దాడి.. 6 వేల సార్లు హ్యాకింగ్‌కు ప్రయత్నాలు

దేశ రాజధానిలోని ఢిల్లీలో ప్రముఖ ఆస్పత్రి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)పై సైబర్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. సర్వర్లన్ని డౌన్‌ అయిన..

Cyber Attack: ఎయిమ్స్‌ తర్వాత ఐసీఎంఆర్‌పై సైబర్‌ దాడి.. 6 వేల సార్లు హ్యాకింగ్‌కు ప్రయత్నాలు
మీ వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో పంచుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మిమ్మల్ని ట్రాక్ చేయడానికి స్కామర్‌లు దీన్ని ఉపయోగించవచ్చు.
Follow us

|

Updated on: Dec 07, 2022 | 8:35 PM

దేశ రాజధానిలోని ఢిల్లీలో ప్రముఖ ఆస్పత్రి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)పై సైబర్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. సర్వర్లన్ని డౌన్‌ అయిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. డేటాపై మొత్తం ఆరు రోజుల పాటు కొనసాగింది. దీంతో ఆస్పత్రి కార్యకలాపాలను నిలిపివేసింది. మాజీ ప్రధానులు, వీవీఐపీలతో సహా కోట్లాది మంది రోగుల ముఖ్యమైన డేటా ప్రమాదంలో పడిపోయంది. సర్వర్లు డౌన్‌ అయి రెండు వారాలు గడిచినా ఇంకా పని చేయడం లేదు.

దేశంలోని అత్యున్నత వైద్య సంస్థలే లక్ష్యంగా దుండగులు ఈ సైబర్‌ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎయిమ్స్‌ తర్వాత భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)పై సైబర్‌ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. నవంబర్ 30న 24 గంటల వ్యవధిలో హాంకాంగ్‌కు చెందిన హ్యాకర్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెబ్‌సైట్‌ను దాదాపు 6000 సార్లు టార్గెట్ చేశారని అధికారులు తెలిపారు. అయితే ఐసీఎంఆర్‌ వెబ్‌షైట్‌ కంటెంట్‌లు సురక్షితంగా ఉన్నాయి. ఐపీ అడ్రస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ట్రేస్‌ చేయగా, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న హాంకాంగ్‌కు చెందిన ఐపీ అడ్రస్‌గా తెలిందని అధికారులు తెలిపారు. అయితే అప్‌డెట్‌ ఫైర్‌వాల్‌, పటిష్టమైన భద్రత ఉండటం కారణంగా ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురి కాలేదని అధికారులు ప్రకటించారు.

మరోవైపు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ముందున్న సఫ్దార్‌గంజ్‌ ఆస్పత్రిపై కూడా డిసెంబర్‌ 4న సైబర్‌ దాడి జరిగింది. ఈ సైబర్‌ దాడిలో ఎయిమ్స్‌తో పోల్చుకుంటే నష్టం చాలా తక్కువేనని అధికారులు పేర్కొన్నారు. రోజంతా సర్వర్లు పని చేయలేదని ఆస్పత్రి వైద్యులు బీఎల్‌ శెర్వాల్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా! నెట్టింట ట్రెండింగ్‌ పిక్స్
మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా! నెట్టింట ట్రెండింగ్‌ పిక్స్
శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్..
శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్..
'నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..' చరణ్ ఎమోషనల్ కామెంట్స్..
'నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..' చరణ్ ఎమోషనల్ కామెంట్స్..
మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..
మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?