Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడు తండ్రేనా..! రూ.10 తీసుకుని బిస్కెట్స్ తిన్నదని ఆరేళ్ళ కూతురికి దారుణమైన శిక్ష.. పరిస్థితి విషమం

డబ్బులు దొంగిలించి బిస్కెట్లు తింటావా అంటూ కూతురిని తండ్రి తీవ్రంగా కొట్టాడు. అంతే కాదు, గొలుసుతో కట్టివేసి.. వేడి ఇనుప కడ్డీ తో వాతలు పెట్టాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు చిన్నారి కాలు కూడా విరిగింది.

వీడు తండ్రేనా..! రూ.10 తీసుకుని బిస్కెట్స్ తిన్నదని ఆరేళ్ళ కూతురికి దారుణమైన శిక్ష.. పరిస్థితి విషమం
Father Burnt His Daughter
Follow us
Surya Kala

|

Updated on: Feb 07, 2023 | 7:53 AM

బీహార్‌లోని సమస్తిపూర్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి తన  ఆరేళ్ళ కూతురిని క్రమశిక్షణ పేరుతో దారుణంగా  హింసించాడు. చిన్నారి బాలిక ఇంట్లో నుంచి డబ్బులు ఎవరికీ చెప్పకుండా తీసుకుని బిస్కెట్లు కొనుక్కుని తిన్నది. డబ్బులు పోయాయని తీసుకున్న తండ్రి.. అరా తీయగా కూతురు తీసినట్లు తెలిసింది. దీంతో డబ్బులు దొంగిలించి బిస్కెట్లు తింటావా అంటూ కూతురిని తండ్రి తీవ్రంగా కొట్టాడు. అంతే కాదు, గొలుసుతో కట్టివేసి.. వేడి ఇనుప కడ్డీ తో వాతలు పెట్టాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు చిన్నారి కాలు కూడా విరిగింది. బాలిక తండ్రిని కొట్టవద్దు అంటూ అభ్యర్థిస్తూనే ఏడుస్తూనే ఉంది.. అయినప్పటికీ ఆ కసాయి  తండ్రి మనసు కరగలేదు.. చిన్నారిని కొడుతూనే ఉన్నాడు.

ఈ దారుణ ఘటన షాపూర్ పటోరీకి చెందిన నార్త్ ధామన్‌లో జరిగింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. చిన్నారిని చికిత్స నిమిత్తం సదర్ ఆసుపత్రిలో చేర్చారు. తండ్రి కూతురుని కొట్టిన తీరుపై ఇరుగుపొరుగు వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి చేరుకుంది. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.

నిందితుడు పేరు మంటూన్ రాయ్ అని .. బండి నడుపుతున్నట్లు తెలుస్తోంది. అతను తరచూ తన భార్యతో గొడవ పడేవాడు. దీంతో భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఇద్దరు కుమార్తెలు తమ తండ్రితో నివసిస్తున్నారు. బాధితురాలి పేరు శివాని అని చెబుతున్నారు. ఈ సంఘటన గత సోమవారం జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..