దుబాయ్‌ కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్‌.. మహారాష్ట్రలో పట్టుబడ్డ భారీగా బంగారం, వెండి, కోట్లకొద్ది నగదు..

|

Jul 23, 2023 | 10:07 PM

నిందితుడు అనంత్ జైన్ అలియాస్ షోంటుగా గుర్తించారు. పోలీసులకు విషయం తెలిసి పోయింది అని తెలియగానే..వెంటనే నిందితుడు ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసుల దాడిలో నిందితుడి ఇంటి నుంచి 17 కోట్ల రూపాయల నగదు, 14 కిలోల బంగారం, 200 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

దుబాయ్‌ కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్‌.. మహారాష్ట్రలో పట్టుబడ్డ భారీగా బంగారం, వెండి, కోట్లకొద్ది నగదు..
Cricket Betting
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు అత్యంత క్రేజ్ భారతదేశంలోనే కనిపిస్తుంది. చాలా మంది అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌ను దేవుడిలా పూజిస్తారు. క్రికెట్‌పై భారతీయులకు ఉన్న క్రేజ్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ పేరిట అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ బెట్టింగ్ ముఠాలు విస్తరించాయి. బెట్టింగ్ హ్యాండ్లర్లు దుబాయ్ నుంచి క్రికెట్ బ్లాక్ మనీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన షాకింగ్ కేసు తెరపైకి వచ్చింది.

ఓ బుకీ తనను రూ.58 కోట్లు మోసం చేశాడని ఓ వ్యాపారి ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోండియాకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ బుకీపై  ఒక వ్యాపారవేత్తను నకిలీ బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడులు పెట్టమని ఎర చూపి రూ.58 కోట్లకు పైగా మోసం చేసినందుకు కేసు నమోదు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. విషయం వెలుగులోకి రావడంతో నిందితుడి ఇంటిపై పోలీసు బృందం దాడి చేయగా కళ్లు బైర్లు కమ్మే విషయాలు కనిపించాయి. నిందితుడు అనంత్ జైన్ అలియాస్ షోంటుగా గుర్తించారు. పోలీసులకు విషయం తెలిసి పోయింది అని తెలియగానే..వెంటనే నిందితుడు ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసుల దాడిలో నిందితుడి ఇంటి నుంచి 17 కోట్ల రూపాయల నగదు, 14 కిలోల బంగారం, 200 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

కాకా చౌక్‌లోని నిందితుడు అనంత్ జైన్ నివాసంపై నాగ్‌పూర్ పోలీసులు దాడి చేసి రూ. 17 కోట్ల నగదు, సుమారు 4 కిలోల బంగారం, 200 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారని, తదుపరి విచారణ కొనసాగుతోందని నాగ్‌పూర్ సీపీ అమితేష్ కుమార్ తెలిపారు. నిందితులు ఇంకా అనేక మందిని మోసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్రమ అంతర్జాతీయ వ్యాపారంపై క్రైం బ్రాంచ్, సైబర్ నిపుణులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతుందని సీపీ అమితేశ్ కుమార్ తెలిపారు. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ముఠా.. ఇండియా మొత్తం తన వల వేస్తోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..