పెళ్లి చేసుకోవాలంటే వధూవరులకు కోవిడ్ రిపోర్ట్ తప్పనిసరి.. లేదంటే కఠనమైన చర్యలు.. ఎక్కడంటే..

|

May 20, 2021 | 6:46 PM

కరోనా వైరస్.. రోజుకీ లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు.. ఓవైపు ఈ రెండో దశ కోవిడ్‏ను నియంత్రించడానికి అనేక విధాలుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ..

పెళ్లి చేసుకోవాలంటే వధూవరులకు కోవిడ్ రిపోర్ట్ తప్పనిసరి.. లేదంటే కఠనమైన చర్యలు.. ఎక్కడంటే..
Covid Test
Follow us on

కరోనా వైరస్.. రోజుకీ లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు.. ఓవైపు ఈ రెండో దశ కోవిడ్‏ను నియంత్రించడానికి అనేక విధాలుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. దయచేసి ఎవరు బయటకు రాకండి… అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇల్లు దాటండి.. కరోనా జాగ్రత్తలు పాటించండి అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్న కానీ ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. కరోనాను లైట్‏గా.. జాగ్రత్తలు పాటించని వారిని కరోనా కబలిస్తుంది. కనీసం చివరి చూపులు కూడా తమ ఆత్మీయులకు దక్కకుండా చేస్తుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు ఈ వైరస్ కట్టడికి లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. విందులు, వినోదాలు వంటి వేడుకలను పూర్తిగా రద్దు చేశాయి. ఇక పెళ్ళిళ్లకు.. అంత్యక్రియలకు అతి కొద్ది మంది మాత్రమే హజరు కావాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకునే వధూవరులు.. వారి కుటుంబ సభ్యులు.. ఇతరులు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని భువనేశ్వర్‏లోని గంజాం జిల్లా అధికారులు చెప్పారు.

వివాహానికి జిల్లా యాంత్రాంగం అనుమతి కోరే ముందు వారి కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలనే నిబంధనను ప్రకటించింది. వివాహానికి ముందుకు వరుడు లేదా వధువు తరుపున వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేయించుకోకపోతే.. వివాహానికి అనుమతి ఇవ్వబడదని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృతా కులాంగే తెలిపారు. జిల్లాలోని అన్ని బిడిఓలు, తహశీల్దార్లను ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వధూవరులతో సహా 50 మంది పాల్గొనే వారితో వివాహ వేడుకలు జరుగుతున్నాయి.

Also Read: సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో సింగర్ అర్జిత్ సింగ్ తల్లి మృతి.. సాయం కోసం అభ్యర్థించిన ఫలితం లేదు..

Manchu Manoj: మంచు మనోజ్ దాతృత్వం.. కరోనా కష్టంలో వారికి అండగా.. పుట్టినరోజు వేళ 25వేల కుటుంబాలకు సాయం..

లక్కీ ఛాన్స్ అందుకున్న బాలీవుడ్ హీరోయిన్.. హాలీవుడ్‏ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. పవర్‏ఫుల్ పాత్రలో బ్యూటీ..