Wearing Masks: కుంటి సాకులు ఆపండి.. ఇకనైనా మాస్క్‌లు పెట్టుకోండి.. ఆరోగ్య శాఖ హితవు

People Avoid Wearing Masks: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు రోజు నాలుగు లక్షలకు

Wearing Masks: కుంటి సాకులు ఆపండి.. ఇకనైనా మాస్క్‌లు పెట్టుకోండి.. ఆరోగ్య శాఖ హితవు
Not Wearing Masks

Updated on: Jul 13, 2021 | 7:58 PM

People Avoid Wearing Masks: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు రోజు నాలుగు లక్షలకు చేరువలో కేసులు.. వేలాది మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నాయి. కఠిన లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివి అమలు చేశారు. అనంతరం దేశవ్యాప్తంగా కరోనా అదుపులోకి వచ్చింది. తాజాగా అన్ని చోట్లా ఆంక్షలు ఎత్తివేయడంతో.. ప్రమాదం మరోలా పొంచుకొస్తోంది. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పాటించాల్సిన కరోనా నిబంధనలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మాస్కులు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కట్టడికి మాస్కులు ధరించాలని పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ.. ప్రజలు కుంటిసాకులతో తప్పించుకుంటున్నారని.. ఇది పద్దతి కాదని.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు ఎందుకు మాస్కు ధరించడం లేదో జరిపిన ఒక సర్వేను ఉదహరించింది. ఈ సందర్భంలో ప్రజలు చెప్పిన కుంటి సాకులను కూడా వెల్లడించింది.

కొంతమంది ఎందుకు మాస్కులు ధరించడం లేదని తెలుసుకోవడానికి ఈ సర్వే జరిగింది. మాస్కులు ధరించకుండా ఉండటానికి ప్రజలు సాధారణంగా ఈ మూడు రకాల కారణాలను సాకుగా చెప్పారని సర్వే వెల్లడించింది. ‘‘ప్రజలు శ్వాస సమస్యలను సాకుగా చూపించి మాస్కులు ధరించడం లేదని వెల్లడించింది. అసౌకర్యంగా ఉందని మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరాన్ని పాటిస్తున్నాం కావున మాస్కు ధరించాల్సిన అవసరం లేదు.’’ అని చాలామంది బదులిచ్చినట్లు సర్వే వెల్లడించింది.

ఈ మేరకు మంగళవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించింది. కోవిడ్-19 ను నివారించడానికి మాస్కులు తోడ్పాటునందిస్తాయని.. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కోవిడ్ -19 ప్రోటోకాల్స్ పాటించకపోతే థర్డ్ వేవ్‌కు స్వాగతం పలికినట్లేనని ప్రభుత్వం హెచ్చరించింది. కావున నిబంధనలను తేలిగ్గా తీసుకోవద్దంటూ సూచించింది.

Also Read:

Hero Family: ఎలక్ట్రిక్ వాహనాల కోసం హీరో బ్రాండ్ వాడకంపై ముంజాల్ కుటుంబంలో ముదురుతున్న వివాదం

Telangana Corona: తెలంగాణలో కాస్త పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 767 మందికి పాజిటివ్, ముగ్గురు మృతి