India Covid-19 Updates: దేశంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మూడు రోజుల నుంచి వరుసగా 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ (Coronavirus) అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశించింది. కాగా.. గత 24 గంటల్లో కూడా కరోనా కేసుల సంఖ్య 20 వేలకు పైగా నమోదయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 20,044 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో1,40,760 (0.32 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.80 శాతం పెరగగా.. రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది.
#COVID19 | India reports 20,044 fresh cases, 18,301 recoveries, and 56 deaths in the last 24 hours.
ఇవి కూడా చదవండిActive cases 1,40,760
Daily positivity rate 4.80% pic.twitter.com/lvMcyWZ0ti— ANI (@ANI) July 16, 2022
నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 3,067, కేరళలో 2,927, మహారాష్ట్రలో 2,371, తమిళనాడులో 2,312, ఒడిశాలో 1,043 కేసులు నమోదయ్యాయి.