India Covid-19: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా ఉధృతి.. 203 రోజుల తర్వాత భారీగా తగ్గిన కేసులు..

|

Oct 06, 2021 | 9:41 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ

India Covid-19: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా ఉధృతి.. 203 రోజుల తర్వాత భారీగా తగ్గిన కేసులు..
India Corona
Follow us on

India Coronavirus Updates: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య భారీగా తగ్గుతున్నాయి. 20 వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,833 కేసులు నమోదయ్యాయి. 203 రోజుల తర్వాత కేసుల సంఖ్య భారీగా కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,46,687 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా 278 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,71,881 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,49,538 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 24,770 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,31,75,656కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 14,09,825 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 57,68,03,867 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

Petrol Diesel Price: మళ్లీ మొదలైన పెట్రో మంట.. తెలంగాణలోని కొన్ని నగరాల్లో సెంచరీ కొట్టిన డీజిల్ ధర..

Modi Cabinet Ministers Assets: మోదీ కేబినెట్లో స్మార్ట్ ఇన్వెస్టింగ్ మినిస్టర్స్.. ప్రధాని రూటు సెపరేటు. ఎవరెవరి ఆస్తులు ఎంతెంత పెరిగాయంటే.?