Covid 4th Wave: దేశంలో భారీగా పెరుగుతున్న రికవరీల సంఖ్య.. నిన్న ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?

గురువారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. రికవరీల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,561 కరోనా కేసులు నమోదయ్యాయి.

Covid 4th Wave: దేశంలో భారీగా పెరుగుతున్న రికవరీల సంఖ్య.. నిన్న ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?
India Corona
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 12, 2022 | 9:53 AM

India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో చర్యలు చేపట్టాలని సూచించింది. ఇటీవల కాలంలో దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు.. రెండు రోజుల నుంచి 16వేలకు పైగా నమోదవుతున్నాయి. గురువారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. రికవరీల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,561 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,23,535 (0.28 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 5,44 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.53 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా గణాంకాలు..

ఇవి కూడా చదవండి

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,42,23,557 కి పెరిగింది. కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,26,928 కి చేరింది. నిన్న కరోనా నుంచి 18,053 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,35,73,094 కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 207.47 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. దేశంలో నిన్న 17,72,441 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

ఢిల్లీలో అత్యధికంగా..

ఢిల్లీలో అత్యధికంగా 2,726 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 1,877, కర్ణాటకలో 1,691, హర్యానాలో 1145, కేరళలో 1212 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!