Covid 4th Wave: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే..?

ప్రస్తుతం దేశంలో 1,47,512 (0.34 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.48 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.47 శాతం ఉంది.

Covid 4th Wave: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే..?
Coronavirus

Updated on: Jul 26, 2022 | 10:05 AM

Covid-19 Updates in India: భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దేశంలో 20 వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో (సోమవారం) కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది. దేశవ్యాప్తంగా నిన్న 14,830 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 2,036 కేసులు తగ్గాయి. ఈ మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 2,036 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,47,512 (0.34 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.48 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.47 శాతం ఉంది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా గణాంకాలు..

ఇవి కూడా చదవండి
  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,38,88,7551 కి పెరిగాయి.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,26,110 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 18,159 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,32,46,829 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 202.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • దేశంలో నిన్న 30,42,476 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
  • దేశవ్యాప్తంగా నిన్న 4,26,102 మందికి కరోనా పరీక్షలు చేశారు.
  • ఇప్పటివరకు 87.31 కోట్ల పరీక్షలను నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us