India Coronavirus: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ వేయికి దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతోంది.

India Coronavirus: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..?
India Coronavirus Updates
Follow us

|

Updated on: Apr 09, 2022 | 11:26 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ వేయికి దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతోంది. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. డిచిన 24 గంటల్లో శుక్రవారం దేశవ్యాప్తంగా 1,150 కరోనా కేసులు ( Coronavirus ) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో కేరళలోనే 75 మరణాలు నమోదయ్యాయి. గత హెచ్చుతగ్గులకు సంబంధించి కేరళ గణాంకాలను సవరిస్తుండటం దీనికి కారణమని అధికారులు తెలిపారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 11,365 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,34,217 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,656 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 1194 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,01,196 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,85.55 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా నిన్న 4,66,362 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వాటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 79.34 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.

Also Read:

CJI NV Ramana: ‘ప్రభుత్వం న్యాయమూర్తుల పరువు తీస్తోంది.. ఈ కొత్త ట్రెండ్ మొదలైంది’.. సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు!

Viral Video: ఈ కిలాడీ కుక్క తెలివే వేరయా..! ఆహారం కోసం ఏం చేసిందో చూస్తే.. ఫ్యూజులు ఎగరాల్సిందే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన