పోర్న్ మూవీల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాకు ఊరట లభించలేదు. ఆయన బెయిల్ పిటిషన్ ను బాంబేహైకోర్టు తిరస్కరించింది. తన అరెస్టు అక్రమమని, చట్ట విరుద్ధమని కుంద్రా తన పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే బ్రిటిష్ పొరసత్వం కలిగిన ఈయనకు బెయిల్ మంజూరు చేసిన పక్షంలో సాక్ష్యాధారాలను నాశనం చేస్తాడని, భవిష్యత్తులో సైతం ఈ విధమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఇతని సహచరుడైన ర్యాన్ థోర్పే.. వాట్సాప్ లోని పలు మెసేజులు, సాక్ద్యాధారాలను డిలీట్ చేశాడని వారు పేర్కొన్నారు. కుంద్రాకు చెందిన స్టోరేజీ ఏరియా నెట్ వర్క్ నుంచి 53 అడల్ట్ మూవీలను, అతని ల్యాప్ టాప్ నుంచి మరో 68 చిత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దృష్ట్యా ఈయనకు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని వారున్నారు. ఇతని అరెస్టు చాలా కీలకమని స్పష్టం చేశారు. ర్యాన్ థోర్పే బెయిల్ పిటిషన్ ని కూడా కోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసులో నటి-మోడల్ షెర్లిన్ చోప్రాను పోలీసులు నిన్న 8 గంటల పాటు విచారించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు ఇంటరాగేట్ చేశారు. తనకు తెలియకుండా కుంద్రా మాటలను నమ్మానంటూ ఆమె కంట తడి పెట్టింది.. కాగా- తాను అరెస్టు కాకుండా ఈమె దాఖలు చేసిన ప్రీ-అరెస్ట్ బెయిల్ పిటిషన్ ని కోర్టు గతవారం తిరస్కరించింది. మరో వైపు పోర్న్ రాకెట్ తో లింక్ ఉన్న అర్మ్స్ ప్రైమ్ అనే కంపెనీ డైరెక్టర్ ని కూడా పోలీసులు విచారించారు. బహుశా ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: సుప్రీంకోర్టు జడ్జినే అంత మాటన్నాడు.. బ్రెజిల్ అధ్యక్షుని నోటి దురుసు