అధికారుల వేధింపులతో జీవితంపై విరక్తి.. కారణ్య మరణం కోరుతూ రాష్ట్రపతికి దంపతుల లేఖ.

|

Nov 11, 2022 | 3:56 PM

సాధారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడినవారు, జీవచ్ఛవంలా ఉన్న వారు కారుణ్య మరణం కోరుతూ లేఖలు రాస్తారు. అయితే తాజాగా కర్ణాటకలో విచిత్ర సంఘటన జరిగింది. తమను అధికారులు వేధిస్తున్నారని ఓ జంట కారుణ్య మరణాన్ని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఇప్పుడీ అంశం దేశ వ్యాప్తంగా..

అధికారుల వేధింపులతో జీవితంపై విరక్తి.. కారణ్య మరణం కోరుతూ రాష్ట్రపతికి దంపతుల లేఖ.
Couple Seeks Euthanasia
Follow us on

సాధారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడినవారు, జీవచ్ఛవంలా ఉన్న వారు కారుణ్య మరణం కోరుతూ లేఖలు రాస్తారు. అయితే తాజాగా కర్ణాటకలో విచిత్ర సంఘటన జరిగింది. తమను అధికారులు వేధిస్తున్నారని ఓ జంట కారుణ్య మరణాన్ని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఇప్పుడీ అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇంతకీ అధికారులు ఈ జంట ఎందుకు కారుణ్య మరణాన్ని కోరిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో నివాసం ఉంటున్నారు శ్రీకాంత్‌, సుజాత నాయక్‌ దంపతులు. ఇటీవల వీరు నిర్మించిన లే అవుట్‌లో స్థలాలను క్లియర్‌ చేయడానికి సాగర తాలూకు పంచాయనీ కార్వనిర్వహణ అధికారి రూ. 10 లక్షలు లంచం ఇవ్వాలని అడిగారు. దీంతో ఎంతకీ అధికారుల వేధింపులు తగ్గకపోవడంతో ఈ దంపతులు కారుణ్య మరణాన్ని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ విషయమై సుజాత మాట్లాడుతూ.. ‘స్థలం తాలుకూ విషయంలో పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. అవి ఇచ్చిన తర్వాత తాలూకా పంచాయతీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రూ. 10 లక్షలు లంచం అడుగున్నారు. మా దగ్గర ఇప్పుడు ఇవ్వడానికి చిల్లి గవ్వ కూడా లేదు’ అని వాపోయింది.

ఇక శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ అధికారులు మమ్మల్ని లంచం కోసం నిత్యం వేధిస్తున్నారు. మాది చాలా నిరుపేద కుటుంబం, జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాము. ఇప్పుడు మా దగ్గర వేరే మార్గం లేదు, ఏం చేయాలో తెలియక మరణించాలనునుకుంటున్నాం’ అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఈ విషయమై అసిస్టెంట్ కమిషనర్‌ స్పందించారు. అధికారులపై వస్తోన్న ఆరోపణలను ధృవీకరించిన తర్వాత ఉన్నతధికారులకు నివేదిక పంపించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..