
Covid-19 Cases in India: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం భారీగా తగ్గిన కరోనా కేసులు.. శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 33,376 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 308 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా.. కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో.. కేరళలో 25,010 కరోనా కేసులు నమోదు కాగా.. 177 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80 శాతానికి పైగా కరోనా కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,32,08,330 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,42,317 చేరింది. నిన్న కరోనా నుంచి 32,198 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,23,74,497 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,91,516 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 73,05,89,688 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 65,27,175 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.
కాగా.. నిన్న దేశవ్యాప్తంగా 15,92,135 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు (సెప్టెంబర్ 10 వరకు) 54,01,96,989 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
India reports 33,376 new #COVID19 cases, 32,198 recoveries and 308 deaths in last 24 hours, as per Health Ministry.
Total cases: 3,32,08,330
Active cases: 3,91,516
Total recoveries: 3,23,74,497
Death toll: 4,42,317Total vaccination: 73,05,89,688 (65,27,175 in last 24 hours) pic.twitter.com/ESmk1Q9BMN
— ANI (@ANI) September 11, 2021