National Corona: దేశంలో పూర్తిగా తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. మరణాలు కూడా.. తాజాగా ఎన్ని కేసులంటే..

|

Oct 13, 2021 | 10:11 AM

National Corona: గత ఏడాదికి పైగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం..

National Corona: దేశంలో పూర్తిగా తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. మరణాలు కూడా.. తాజాగా ఎన్ని కేసులంటే..
Follow us on

National Corona: గత ఏడాదికి పైగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక భారత్‌లో తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,823 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. విడుదలైన కరోనాహెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. తాజాగా ఒక రోజులో కరోనాతో 226 మంది మృతి చెందగా, ఇప్పటి వరకే దేశంలో మృతుల సంఖ్య 4,51,189కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం రికవరీ కేసుల సంఖ్య 3,33,42,901 ఉంది. ఇక గత 24 గంటల్లో 22,844 మంది కరోనా పేషెంట్లు  కోలుకున్నారు. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,07,653 ఉంది. ఇప్పటికే దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.39 కోట్లకు చేరింది. దేశంలో రికవరీ రేటు 98.06 శాతం ఉంది.

ఇక అక్టోబర్‌ 12వ తేదీ వరకు దేశంలో 58,63,63,442 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) తెలిపింది. నిన్న ఒక్క రోజే 13,25,399 కరోనా నమూనాలను పరీక్షంచినట్లు తెలిపింది. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కూడా వేగవంతం అవుతోంది. నిన్న 50.6. లక్షల మంది కోవిడ్‌ టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు వేసిన టీకాల సంఖ్య 96.43 కోట్ల దాటింది.

ఇదిలా ఉండగా, నిన్న దేశవ్యాప్తంగా 14,313 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 181 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. దాదాపు ఆరు నెలల తర్వాత రోజువారిగా నమోదయ్యే కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. కాగా.. కేరళలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.

ఇవీ కూడా చదవండి:

Covid-19 Vaccine: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా లాభం లేదా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు!

Minister Gangula: తెలంగాణ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కి కరోనా పాజిటివ్