ఇకపై గాంధీలోనే కరోనా పరీక్షలు

కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనాలో బయటపడ్డ ఈ మహమ్మారి..ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కల్లోలం మొదలైంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముందుగానే అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్యసహాయాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. తాజాగా కేంద్రంతో సంప్రదింపులు జరిపిన వైద్య ఆరోగ్య శాఖ ఇకపై కరోనా నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్‌లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. మన రాష్ట్రంలో ప్రస్తుతానికి ఈ వ్యాధి ఎవరికీ సోకలేదని […]

ఇకపై గాంధీలోనే కరోనా పరీక్షలు
Follow us

|

Updated on: Jan 30, 2020 | 2:04 PM

కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనాలో బయటపడ్డ ఈ మహమ్మారి..ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కల్లోలం మొదలైంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముందుగానే అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్యసహాయాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. తాజాగా కేంద్రంతో సంప్రదింపులు జరిపిన వైద్య ఆరోగ్య శాఖ ఇకపై కరోనా నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్‌లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.

మన రాష్ట్రంలో ప్రస్తుతానికి ఈ వ్యాధి ఎవరికీ సోకలేదని చెబుతున్నా….ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది వైద్యశాఖ. ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే… వెంటనే డాక్టర్‌ను కలవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, నిన్న మొన్నటి వరకు పుణేలో మాత్రమే కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. దీంతో వైరస్‌ సోకిన వారిని గుర్తించి వైద్యం అందించటంలో ఆలస్యం చోటు చేసుకుంటోందని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. కరోనా నిర్ధారణ కిట్లను రాష్ట్రానికి పంపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. మరో 10 రోజుల్లో గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ను గుర్తించేందుకు తగిన ఏర్పాట్లు అందుబాటులోకి రానున్నాయి.

కరోనావైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్నిరకాల చర్యలు తీసుకున్నామని ఇప్పటికే ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. గతంలో స్వైన్‌ఫ్లూని ఎదుర్కొన్నట్లే.. ఇప్పుడు కరోనాని ఎదుర్కొంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి కరోనా వైరస్‌ కేసు నమోదు కాలేదన్నారు. కరోనా నేపథ్యంలో కేంద్రం పంపించిన బృందం ఈ వైరస్‌పై పూర్తి అవగాహన కల్పించినట్లు చెప్పారు. వైరస్ సోకడానికి గల కారణాలు, నివారణ చర్యలు, వైరస్‌ నిర్ధారణపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో కేంద్ర బృందం పలు సూచనలు చేసినట్లు చెప్పారు. కరోనా వైరస్‌ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి ఈ వైరస్‌కి మందు లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా సబ్బు నీటితో చేతులు కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఉండొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఫీవర్‌ ఆసుపత్రిలో ఉన్నవారి కుటుంబ సభ్యులను కూడా ఇంటికి పరిమితిం చేశారు అధికారులు.

Latest Articles
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
సెలవుల్లో టూర్‌కు వెళ్లాలా.? థాయ్‌లాండ్ ప్యాకేజీ తెలుసుకోండి
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
కాకరకాయ చేదును ఎలా తగ్గించాలి..? అద్భుతమైన చిట్కాలు
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఈ రేంజ్‌లో అదరగోడుతుంది..!
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
భారతీయులారా.. మా దేశానికి రండి.. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు..
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
నిద్ర లేవని భార్య.. ఆకలితో ఆఫీసుకు వెళ్తున్న భర్త విన్నపం ఏమిటంటే
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..