Indian Corona Updates: దేశంలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 3,57,229 కేసులు నమోదు.. 3,449 మంది మృతి..

Indian Corona Updates: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో మరింత విజృంభిస్తోంది. ఫలితంగా దేశంలో కరోనా..

Indian Corona Updates: దేశంలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 3,57,229 కేసులు నమోదు.. 3,449 మంది మృతి..
Corona

Updated on: May 04, 2021 | 1:42 PM

Indian Corona Updates: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో మరింత విజృంభిస్తోంది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,57,229 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,20,289 మంది కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. అయితే, దురదృష్టావశాత్తు కరోనా వైరస్ బారిన పడి ఒక్క రోజులోనే 3,449 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,02,82,833 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 1,66,13,292 మంది కోలుకున్నారు. ఇక కరోనా వైరస్ ప్రభావంతో 2,22,408 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 34,47,133 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఓవైపు కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది. దేశం వ్యాప్తంగా ఇప్పటి వరకు 15,89,32,921 వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆ మేరకు రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

Also read:

Janhvi Kapoor: ఎల్లోరా శిల్పంలా కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ… జాన్వీ కపూర్ అందాలకు కుర్రకారు ఫిదా..

కరోనా క‌ల్లోలం.. పాలకుర్తి ఆలయంలోకి భక్తులకు నిరాకరణ.. ఎప్ప‌టివ‌ర‌కు అంటే..

Telangana Politics: తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ?.. ఆరోగ్యశాఖ మంత్రిగా మళ్లీ లక్ష్మారెడ్డికి ఛాన్స్..!