Corona Vaccines: ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్ని డోసులు అందాయో తెలిపిన కేంద్రం..!

|

Nov 20, 2021 | 7:43 PM

Corona Vaccines: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తో పాటు ఇతర చర్యల కారణంగా అదుపులో..

Corona Vaccines: ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్ని డోసులు అందాయో తెలిపిన కేంద్రం..!
Follow us on

Corona Vaccines: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తో పాటు ఇతర చర్యల కారణంగా అదుపులో ఉంది. అంతేకాకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశంలో వేగవంతం చేయడంతో ఇమ్యూనిటీ లెవల్స్‌ పెరిగిన కరోనా బారిన పడకుండా ఉంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే వంద కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 129 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇంకా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 21.65 కోట్ల డోసులు నిల్వ ఉన్నాయని తెలిపింది.

జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభం:
కాగా, 2021 జనవరి 16వ తేదీన దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే వ్యాక్సిన్ల కొరత కారణంగా మొదట్లో కాస్త నెమ్మదిగా కొనసాగింది. కానీ క్రమ క్రమంగా టీకాల ఉత్పత్తి పెరగడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం కరోనా అదుపులోకి వచ్చింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడం, ఇతర చర్యల వల్ల కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

ఇవి కూడా చదవండి:

PM SVANidhi: వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకుంటే సులభంగా రుణాలు..!

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి..!