Coromandel Express: ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్‌ రైలును ఢీకొట్టిన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌.

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం ప్రమాదం జరిగింది. గూడ్స్‌ రైలును ఢీకొట్టడంతో 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం మేరకు సుమారు 200 మందికి గాయాలు అయినట్లు సమాచారం. బగహన స్టేషన్‌లోనే ఆగిఉన్న గూడ్స్‌ను అత్యంత వేగంతో ఢీకొట్టింది...

Coromandel Express: ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్‌ రైలును ఢీకొట్టిన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌.
Coromandel Express

Edited By:

Updated on: Jun 03, 2023 | 9:17 AM

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం ప్రమాదం జరిగింది. గూడ్స్‌ రైలును ఢీకొట్టడంతో 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం మేరకు సుమారు 200 మందికి గాయాలు అయినట్లు సమాచారం. బగహన స్టేషన్‌లోనే ఆగిఉన్న గూడ్స్‌ను అత్యంత వేగంతో ఢీకొట్టింది. ప్రమాదంలో 50 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న రైలు బాలాసోర్‌కు 40 కి.మీ. దూరంలో ప్రమాదం జరిగింది. రాత్రి కావడంతో సహాయ చర్యలకు ఆటంకాలు ఏర్పాడ్డాయి.

శుక్రవారం సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఢీకొనడంతో రైలులోని 18 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏడు బోగీలు ఒకటికి ఒకటి ఢీకొని భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం మేరకు ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us