AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూలీకి దొరికిన రూ.1.4 లక్షల ఫోన్..అతను చేసిన పనికి అందరూ షాక్

రోడ్డుపై వెళ్తున్నుప్పుడు లేదా బస్టాండ్ లో, రైల్వే స్టేషన్లో గాని ఉన్నప్పుడు లేదా ఇంకే చోటైన ఉన్నప్పుడు ఏదైన వస్తువు దొరికితే కొంతమంది దాన్ని తీసుకుని దాచిపెట్టుకుంటారు.

కూలీకి దొరికిన రూ.1.4 లక్షల ఫోన్..అతను చేసిన పనికి అందరూ షాక్
Railway Station
Aravind B
|

Updated on: Mar 22, 2023 | 12:07 PM

Share

రోడ్డుపై వెళ్తున్నుప్పుడు లేదా బస్టాండ్ లో, రైల్వే స్టేషన్లో గాని ఉన్నప్పుడు లేదా ఇంకే చోటైన ఉన్నప్పుడు ఏదైన వస్తువు దొరికితే కొంతమంది దాన్ని తీసుకుని దాచిపెట్టుకుంటారు. మరికొంతమంది దాన్ని తీసుకోరు. ఇంకా మంచి మనసు కలిగినవారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూడా ఆ వస్తువును అప్పగిస్తారు. ఇలాంటి కోవలోకే చెందుతాడు మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఓ కూలి. అతనికి రూ.1.4 లక్షల విలువైన ఓ ఫోన్ దొరికితే దాన్ని పోలీసులకు వెళ్లి అప్పగించాడు. వివరాల్లోకి వెళ్తే దశరథ్ డౌండ్(62) అనే వ్యక్తి దాదర్ రైల్వే స్టేషన్ లో దాదాపు 30 ఏళ్లుగా కూలీగా పనిచేస్తున్నాడు. అతని సంపాదన రోజుకు కేవలం రూ.300 మాత్రమే. అయితే సోమవారం రోజున రాత్రి 11.40 గంటలకు దశరథ్ రైల్వే్ స్టేషన్ లోని ఫ్లాట్ ఫాం నంబర్ లో తన పని ముగించుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలోనే ప్రయాణికులు కూర్చునే చోట అతనికి ఓ ఫోన్ కనిపించింది.

కానీ దశరథ్ ఆశతో ఆ ఫోన్ ను దాచిపెట్టలేదు. అక్కడున్న ప్రయాణికులను ఈ ఫోన్ మీదేనా అంటూ అడిగాడు. కానీ వాళ్లెవ్వరు మాది కాదని చెప్పారు. దీంతో దశరథ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అప్పగించాడు. ఇలా తమకు తెలియని వాళ్ల ఫోన్ అప్పగించడంపై ముందుగా పోలీసులు దశరథ్ ను అభినందించారు. ఆ తర్వాత ఆ ఫోన్ ఎవరిదీ అని ట్రాక్ చేయగా బాలివుడ్ బాద్ షా అమితాబచ్చన్ మేకప్ ఆర్టిస్టు దీపక్ సావంత్ దని గుర్తించారు. తన ఫోన్ ను పోలీసులకు దశరథ్ అప్పగించడం విషయాన్ని తెలుసుకున్న దీపక్ సవంత్ ఆ కూలికి రూ.1000 బహుమానం అందించాడు. ఇంత మంచి పని చేసిన ఆ కూలీని పోలీస్ సిబ్బంది, దీపక్ సవంత్ కుటుంబ సభ్యులు ప్రశంసలతో ముంచెత్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెట్రో ఛార్జీల పెంపు వాయిదా.. బిఎంఆర్‌సిఎల్ కీలక నిర్ణయం..!
మెట్రో ఛార్జీల పెంపు వాయిదా.. బిఎంఆర్‌సిఎల్ కీలక నిర్ణయం..!
భోజనం తర్వాత ఇది ఓ పలుకు నోట్లో వేసుకుంటే.. మీ పొట్ట ఫుల్ ఖుష్‌!
భోజనం తర్వాత ఇది ఓ పలుకు నోట్లో వేసుకుంటే.. మీ పొట్ట ఫుల్ ఖుష్‌!
నాన్న ఆఖరి మజిలీలోనూ కుమార్తెలు... పాడె మోసి...
నాన్న ఆఖరి మజిలీలోనూ కుమార్తెలు... పాడె మోసి...
డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా?
డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా?
బ్లూబెర్రీస్ Vs జామపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
బ్లూబెర్రీస్ Vs జామపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీనే
భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీనే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు ఇలా తాగితే.. బండి నేరుగా షెడ్డుకే!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు ఇలా తాగితే.. బండి నేరుగా షెడ్డుకే!
మీ ఫోన్‌కు ఇలాంటి ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నారా? 3 పెద్ద ప్రమాదాలు
మీ ఫోన్‌కు ఇలాంటి ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నారా? 3 పెద్ద ప్రమాదాలు
మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట..
మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట..
ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 10 కంపెనీలు.. రిలయన్స్ ఎక్కడ?
ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 10 కంపెనీలు.. రిలయన్స్ ఎక్కడ?