Kapil Sibal Vs Cong Leaders: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో ఇంటిపోరు మళ్లీ మొదలయ్యింది. పార్టీని సమూల ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆ పార్టీకి చెందిన G-23 నేతలు తిరిగి తమ గళం విప్పుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీని ప్రక్షాళన చేయాలని వీరు డిమాండ్ చేయడం తెలిసిందే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో G-23 నేతల్లో ఒకరైన సీనియర్ నేత కపిల్ సిబల్(Kapil Sibal).. మళ్లీ పార్టీ అధిష్టానంపై పెదవి విరిచారు. కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతల నుంచి గాంధీలు (సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. వారి స్థానంలో కొత్తవారికి పార్టీ సారథ్య బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ అందరి పార్టీ కావాలి.. కొందరిని ఇంటికి పంపాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారంరేపాయి.
గాంధీలను టార్గెట్ చేస్తూ కపిల్ సిబల్‌పై ఆ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి సీరియస్ అయ్యారు. కపిల్ సిబల్‌కున్న ప్రజాధరణ ఏ పాటితో తనకు అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా కపిల్ సిబల్ ఎన్నో ప్రయోజనాలు పొందారని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలో అంతా సరిగ్గానే ఉందని.. యూపీఏ అధికారంలో లేకపోవడంతో ఇప్పుడు ఆయనకు ఇబ్బందులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. సైద్ధాంతిక మార్పు తీసుకురావాలంటే ఆయన పార్టీ సపోర్ట్ లేకుండా పనిచేయాలని సూచించారు. ఏసీ గదుల్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తే ప్రయోజనం ఏమీ ఉండదని విమర్శించారు.
పార్టీని బలహీనపరిచేందుకే..: ఖర్గే
అటు మరో పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే సైతం గాంధీలపై కపిల్ సిబల్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. కపిల్ సిబల్ ఓ మంచి న్యాయవాది కావొచ్చేమో కానీ.. ఆయన మంచి కాంగ్రెస్ నాయకుడు కారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేందుకు ఆయన ఎప్పుడూ ఏ గ్రామానికీ వెళ్లలేదన్నారు. పార్టీని బలహీనపరిచేందుకు కపిల్ సిబల్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సోనియాగాంధీ లేదా కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరూ బలహీనపరచలేరని మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు.
Also Read..
Tesla CEO Elon Musk: పేరు మార్చుకున్న టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్.. ఎందుకో తెలుసా?
Andhra Pradesh: ఏపీఎస్ ఆర్టీసీలో 1800లకు పైగా కారుణ్య నియామకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!