Congress: వీడని ఉత్కంఠ.. మరోసారి ఆలస్యం కానున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నిక..!

|

Aug 26, 2022 | 7:33 AM

వాస్తవానికి సెప్టెంబర్‌ 20లోపే ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని భావించారు. కానీ ఇప్పుడు అక్టోబర్‌ వరకు వాయిదా వేయనున్నట్టు సమాచారం.

Congress: వీడని ఉత్కంఠ.. మరోసారి ఆలస్యం కానున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నిక..!
Congress
Follow us on

Congress Presidential election: కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక త్వరలోనే జరుగుతుందంటూ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు కొత్త బాస్‌ ఎవరు..? ఒకవేళ గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ఆసక్తి చూపకపోతే.. పార్టీ ప్రెసిడెంట్‌ ఎవరన్న అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ తరుణంలో పార్టీ ప్రెసిడెంట్‌ ఎన్నికను కొన్ని వారాల పాటు పోస్ట్‌పోన్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష పదవిపై క్లారిటీ రాకపోవడంతో ఆ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడానికి సిద్ధం అవుతోంది కాంగ్రెస్‌. ఈనెల 28న CWC సమావేశంలో ఈ వాయిదాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబర్‌ 20లోపే ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని భావించారు. కానీ ఇప్పుడు అక్టోబర్‌ వరకు వాయిదా వేయనున్నట్టు సమాచారం. అయితే సోనియాగాంధీ అధ్యక్షతన ఈ నెల 28న మధ్యాహ్నం మూడున్నరకు CWC వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన సోనియాగాంధీ..అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.

అయితే, రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి పట్ల ఇంట్రస్ట్‌ చూపకపోవడంతో కాంగ్రెస్‌కు కొత్త బాస్‌ ఎవరన్న అంశంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి గాంధీ కుటుంబ సభ్యులు నేతృత్వం వహించకపోతే.. రాజస్థాన్‌ CM అశోక్‌ గెహ్లాట్‌కు ఆ బాధ్యత అప్పగిస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఆ విషయం తనకు తెలియదని ప్రకటించారు గెహ్లాట్‌. గాంధీ కుటుంబం నుంచి అధ్యక్ష పదవికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఎన్నికకు మరింత సమయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నిక ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..