Agnipath Scheme: భారత్‌బంద్‌కు మిశ్రమస్పందన.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాల నిరసన

| Edited By: Anil kumar poka

Jun 21, 2022 | 11:05 AM

Congress Delegation Met President: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. కొన్ని రాజకీయ పార్టీల ఇచ్చిన బంద్‌ పిలుపు ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో కన్పించింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్‌ ధర్నా నిర్వహించింది.

Agnipath Scheme: భారత్‌బంద్‌కు మిశ్రమస్పందన.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాల నిరసన
congress-delegation-met-president-ram-nath-kovind
Follow us on

Agnipath protest: ఆర్మీలో అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపుకు మిశ్రమ స్పందన లభించింది. బీహార్‌ , ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా చోట్ల బంద్‌ ప్రభావం కన్పించింది. తమిళనాడు మినహా దక్షిణాది రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం కన్పించలేదు. ఢిల్లీలో బంద్‌ ప్రభావం స్పష్టంగా కన్పించింది. భారత్‌ బంద్‌ కారణంగా ఢిల్లీలో పలు చోట్ల భారీ ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. ఢిల్లీ -గుర్‌గ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వేలాదివాహనాలు నిలిచిపోయాయి. అగ్నిపథ్‌ స్కీమును వ్యతిరేకిస్తూ పలు సంస్థలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. సర్హాల్‌ ప్రాంతంలో ప్రతి వాహనాన్ని చెక్‌ చేసిన తరువాత ఢిల్లీ లోకి అనుమతిస్తున్నారు పోలీసులు.

అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ , ఆప్‌ పార్టీలు ఢిల్లీలో ఆందోళనలకు పిలుపునిచ్చాయి. నోయిడా , ఫరిదాబాద్‌లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఢిల్లీ శివార్లలో ట్రాఫిక్‌జామ్‌ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అగ్నిపథ్‌ పాలసీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శివాజీ బ్రిడ్జి రైల్వేస్టేషన్‌లో రైలును ఆపి నిరసన తెలిపారు NSUI కార్యకర్తలు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ గొడవలో NSUI కార్యకర్తలకు గాయాలయ్యాయి.

శివాజీ బ్రిడ్జి రైల్వేస్టేషన్‌ దగ్గర ఆందోళన చేస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారత్‌ బంద్‌ కారణంగా 539 రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ. దీంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమిళనాడు, కేరళలో కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. చెన్నైలో రైల్‌రోకోకు ప్రయత్నించిన లెఫ్ట్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర కాంగ్రెస్‌ చేపట్టిన ధర్నాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి సుభోద్‌కాంత్‌ సహాయ్‌. ప్రధాని మోదీ హిట్లర్‌ విధానాలను అమలు చేస్తే హిట్లర్‌ లాంటి చావు ఖాయమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . సుభోధ్‌కాంత్‌ సహాయ్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు బీజేపీ నేతలు. సైనిక బలగాల్లో భర్తీకి రక్షణశాఖ చేపట్టిన అగ్నిపథ్‌ స్కీమ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి గౌడ. అగ్నిపథ్‌ స్కీమ్‌తో దేశంలో నాజీల ఏజెండాను అమలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు కుమారస్వామి. అగ్నివీర్‌లతో ఆర్మీలో చేరేవాళ్ల దేశ ఐకమత్యం కోసం కాకుండా దేశ విచ్చిన్నం కోసం ప్రయత్నిస్తారని విమర్శించారు

ఓవైపు ఆందోళనలు జరుగుతుండగానే రక్షణశాఖ అగ్నిపథ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్మీలో అగ్నివీరుల ఎంపిక కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. నేవీలో అగ్నివీర్‌ల భర్తీ కోసం రేపు నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ఎయిర్‌ఫోర్స్‌ నోటిఫికేషన్‌ ఈనెల 24వ తేదీన విడుదలవుతుంది.

రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల బృందం సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో కలిశారు. రెండు అంశాలను ప్రస్తావించారు. రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించడంపై నిరసనల సందర్భంగా కొందరు పార్టీ ఎంపీలతో ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, అగ్నిపథ్ స్కీమ్‌ను కాంగ్రెస్ నేతలు లేవనెత్తారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతినిధి బృందంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, సీనియర్ నాయకులు పి చిదంబరం, జైరాం రమేష్ మరియు పలువురు నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలువురు ఎంపీలు కూడా పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్ వరకు పాదయాత్ర చేశారు.

అగ్నిపథ్‌పై వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇలా కామెంట్ చేశారు..

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిపై కామెంట్స్

అగ్నిపథ్‌పై కేంద్రం తీరును తప్పుబట్టారు మంత్రి హరీష్‌రావు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అవమానించారన్నారు. దేశ యువతకు చెప్పేది ఇదేనా అని ప్రశ్నించారు. అగ్నిపథ్‌ పేరుతో ఆర్మీని ప్రైవేటీకరించేస్తున్నారని వ్యాఖ్యానించారు.

కైలాష్‌ విజయ్ పై చర్యలకు డిమాండ్

భారత సైనికులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌. ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలంటూ హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

విజయవంతంగా అమలవుతున్నాయి..

అగ్నిపథ్‌పై త్రివిధ దళాల అధికారులు స్పష్టత ఇచ్చారన్నారు జీవీఎల్‌. కేంద్రం మంచి పథకం ప్రవేశపెట్టిందని.. ఇక నుంచి అగ్నిపథ్‌ ద్వారానే నియామకాలు ఉంటాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అగ్నిపథ్‌ లాంటి..
కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు జీవీఎల్.

కోలుకుంటున్న ఆర్మీ అభ్యర్ధులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంలో గాయపడిన ఆర్మీ అభ్యర్ధులు కోలుకుంటున్నారు. తొమ్మిది మంది ఆర్మీ అభ్యర్ధులను డిశ్చార్జ్ చేసిన అనంతరం అరెస్ట్ చేయనున్నారు GRP పోలీసులు. ఇప్పటికే ఈ కేసును హైదరాబాద్ సిట్ కు అప్పగించిన నేపథ్యంలో.. వీరందరినీ సిట్‌ కస్టడీలోకి తీసుకోనుంది. మరో నలుగురు ఇంకా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో పాల్గొన్న ఆందోళనకారులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తర్వాత..చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీంతో వారి తల్లిదండ్రులు చంచల్‌గూడ జైలుకొస్తున్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినా తమ పిల్లలను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఆర్మీ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇక రేపు నేవీ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌ కానుండగా..ఈనెల 24న ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జూలై నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది.

జాతీయ వార్తల కోసం