రైతు చట్టాలకు నిరసనగా పంజాబ్ లో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న తాను ట్రాక్టర్ మీద కుషన్డ్ సోఫా లో కూర్చున్నానన్న కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. రెండు బోయింగ్ విమానాల కోసం ప్రధాని మోదీ రూ. 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ విమానాల్లో కుషన్డ్ సోఫాలే కాదు..లగ్జరీ బెడ్లు కూడా ఉన్నాయి అన్నారు. మన దేశ సరిహద్దుల్లో చైనా ఉద్రిక్తతలు సృష్టిస్తుండగా ఇంత భారీ మొత్తం పెట్టి విమానాలు సేకరించాలా అని దుయ్యబట్టారు. బహుశా తన ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ కు ఓ ఎయిర్ ఫోర్స్ విమానం ఉన్నందువల్ల తనకు కూడా ఎయిరిండియా ప్రత్యేక విమానం ఉండాలని మోదీ తహతహలాడి ఉండవచ్ఛు అని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.