Rahul Gandhi: ఐదో రోజు ముగిసిన రాహుల్‌ గాంధీ విచారణ.. 12 గంటలపాటు ఈడీ ప్రశ్నలు..

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఐదు రోజుల్లో మొత్తం 53 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంగళవారం దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు.

Rahul Gandhi: ఐదో రోజు ముగిసిన రాహుల్‌ గాంధీ విచారణ.. 12 గంటలపాటు ఈడీ ప్రశ్నలు..
Rahul Gandhi

Updated on: Jun 22, 2022 | 5:25 AM

National Herald case – Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని మంగళవారం ఈడీ దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించింది. ఐదో రోజు విచారణ అనంతరం.. రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అయితే మధ్యలో 30 నిమిషాల విరామం ఇచ్చారు. ఈ కేసులో రాహుల్ గాంధీని ఐదు రోజుల్లో మొత్తం 53 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. సెంట్రల్ ఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయానికి మంగళవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల్ చేరుకున్నారు. అంతకుముందు సోమవారం రాహుల్ గాంధీని దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. అయితే.. రాత్రి 8గంటలకు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రాహుల్‌ గాంధీ అరగంట విరామం తర్వాత మళ్లీ విచారణకు వెళ్లారు.

గత వారం సోమ, మంగళ, బుధవారాల్లో వరుసగా మూడు రోజుల పాటు 30 గంటలకు పైగా ED అధికారులు ఆయనను విచారించారు. ఈ సందర్భంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద రాహుల్ గాంధీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సుదీర్ఘ సమయం పాటు ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటివరకు ఈ ఐదురోజుల్లో రాహుల్‌ గాంధీని దాదాపు 53 గంటలకుపైగా ఈడీ విచారించింది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా జూన్‌ 23న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. సోనియా కరోనా బారిన పడటంతో గడువు తీసుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మీడియా నివేదికల ప్రకారం, ఇప్పటివరకు జరిగిన విచారణలో రాహుల్ గాంధీని యంగ్ ఇండియన్ స్థాపన, నేషనల్ హెరాల్డ్ ఆపరేషన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కి కాంగ్రెస్ ఇచ్చిన రుణం, నిధుల బదిలీకి సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లు సమచారం. మీడియా సంస్థలో.. యంగ్ ఇండియన్ ప్రమోటర్లు, వాటాదారులలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా మరికొందరు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాగా.. ఈడీ చర్యలపై కాంగ్రెస్ నేతలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కక్ష్య సాధింపు చర్యలుగా పేర్కొంటున్నారు.

జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..