ఎన్నికల ప్రచారానికి రెడీ ! ఆలయ సందర్శనతో అస్సాం రాష్ట్రానికి రేపు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.

అస్సాంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రెడీ అవుతున్నారు. ఆమె రేపు గౌహతిని సందర్శిస్తారని, అక్కడి కామాఖ్య ఆలయంలో ప్రార్థనలు చేసి

  • Umakanth Rao
  • Publish Date - 7:18 pm, Sun, 28 February 21
ఎన్నికల ప్రచారానికి రెడీ !  ఆలయ సందర్శనతో అస్సాం రాష్ట్రానికి రేపు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.

అస్సాంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రెడీ అవుతున్నారు. ఆమె రేపు గౌహతిని సందర్శిస్తారని, అక్కడి కామాఖ్య ఆలయంలో ప్రార్థనలు చేసి న అనంతరం ప్రచారానికి శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజులపర్యటనలో ప్రియాంక గాంధీ వివిధ జిల్లాలను విజిట్ చేయనున్నారు. ఇప్పటికి మూడు సార్లు ప్రధాని మోదీ ఈ రాష్ట్రాన్ని సందర్శించారు. ఇక ప్రియాంక పర్యటనతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.  మొదట ప్రియాంక లఖిమ్ పూర్, బిహ్ పురియా, తేజ్ పూర్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. వివిధ ర్యాలీల్లో పాల్గొంటారని, పార్టీ కార్యకర్తలతో  సమావేశమవుతారని తెలిసింది. లోగడ సీఏఎ కి వ్యతిరేకంగా ఎగువ అస్సాంలో జరిగిన నిరసనలను ఆమె ప్రస్తావించి ప్రజల మూడ్ ని  తమ పార్టీ ప్రయోజనాలకు అనువుగా వినియోగించుకుంటారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఈ నెల మొదట్లో ఈ రాష్ట్రాన్ని విజిట్ చేసి ‘యాంటీ సీసీఏ గమోసా’ ప్రచారాన్ని చేపట్టిన విషయం గమనార్హం.

ఈ రాష్ట్రాల్లో ప్రియాంక గాంధీ రెండు రోజులుపర్యటించనున్నారు. బీజేపీ నేతలు విజిట్ చేసిన జిల్లాలను ఆమె సందర్శించి ప్రధానంగా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. కాగా ఇటీవల ప్రధాని మోదీ అస్సాంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. పలుప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మొత్తం మూడు సార్లు ఆయన  ఈ రాష్ట్రాన్ని విజిట్ చేసిన నేపథ్యంలో ప్రియాంక ప్రచార సరళి ఏ విధంగా ఉండబోతున్నదన్న సస్పెన్స్ నెలకొంది.

Also Read:

Brain Stroke: బ్రెయిన్‌ స్ట్రోక్‌కు నెల ముందు కనిపించే లక్షణాలు.. ముందస్తుగా గమనిస్తే బయట పడవచ్చంటున్న పరిశోధకులు

Punarnava Benefits : శరీరంలోని అవయవాలను పునరుజ్జీవితం చేసే ఔషధాల గని గలిజేరు. ఉపయోగాలను తెలిస్తే వదలరుగా