Priyanka – Rahul: రాహుల్‌కు భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంక..

|

Nov 06, 2021 | 9:28 PM

పతకాలను ధరించి ఉన్న కళ్లద్దాలు ధరించిన రాహుల్ గాంధీ ఫోటోలో కనిపించారు. రాహుల్ గాంధీ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ ఐకిడోలో బ్లాక్ బెల్ట్.. జాతీయ షూటింగ్ ఛాంపియన్ అయినందున అనేక క్రీడా విజయాలను అందుకున్నారు.

Priyanka - Rahul: రాహుల్‌కు భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంక..
Rahul And Priyanka
Follow us on

భాయ్ దూజ్ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ త్రోబాక్ ఫోటోను షేర్ చేశారు కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ . సత్యం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం తనకు గర్వంగా..  సంతోషంగా ఉందని అన్నారు. ఆమె సోదరులందరికీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన సోదరుడు రాహుల్ గాంధీ ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటోలో ప్రియాంక గాంధీ భుజంపై చేయి వేసిన రాహుల్.. తన మెడలో చాలా మెడల్స్‌ను వేసుకుని కనిపిస్తున్నారు.

అనేక పతకాలను ధరించి ఉన్న కళ్లద్దాలు ధరించిన రాహుల్ గాంధీ ఫోటోలో కనిపించారు. రాహుల్ గాంధీ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ ఐకిడోలో బ్లాక్ బెల్ట్.. జాతీయ షూటింగ్ ఛాంపియన్ అయినందున అనేక క్రీడా విజయాలను అందుకున్నారు.

భాయ్ బిజ్ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాత ఫోటోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘నా అన్నకు కరుణ, ప్రేమ, ధైర్యంతో సత్యం కోసం పోరాడుతున్నందుకు గర్వంగానూ, సంతోషంగానూ ఉన్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు, భాయ్ బీజ్..” అంటూ ఈ ఫోటోను షేర్ చేశారు.

అదే సమయంలో రాహుల్ గాంధీ స్మైలీతో ఫోటోపై స్పందించారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ ఐకిడోలో బ్లాక్ బెల్ట్, జాతీయ షూటింగ్ ఛాంపియన్‌గా కూడా అనేక క్రీడా విజయాలు సాధించారు రాహుల్ గాంధీ.

ఇప్పుడు ప్రియాంక గాంధీతో కలిసి ఉన్న పాత ఫోటోను షేర్ చేశారు రాహుల్ గాంధీ. తన షూటింగ్ నైపుణ్యానికి చాలా పతకాలను గెలుచుకున్నట్లు చూపింది. భాయ్ బిజ్ సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల చిత్రాన్ని కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి: Google Pay: గూగుల్‌ UPI పిన్‌ని మరిచిపోతున్నారా.. మార్చాలా.. చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..

Spectacle Marks: కళ్ల జోడు వాడకంతో ముక్కుపై మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..