Indian Railways: సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లలో రాయితీ తొలగింపు యోచన ఎందుకు.? అధికారులు ఏం చెబుతున్నారంటే.?

Indian Railways: సీనియర్‌ సిటిజన్లకు రైల్వే శాఖ అందించే రాయితీని గత కొన్ని నెలలుగా ఆపేసిన విషయం తెలిసిందే. కోవిడ్‌ పరిణామాల అనంతరం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే...

Indian Railways: సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లలో రాయితీ తొలగింపు యోచన ఎందుకు.? అధికారులు ఏం చెబుతున్నారంటే.?
Indian Railways
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 23, 2022 | 8:36 PM

Indian Railways: సీనియర్‌ సిటిజన్లకు రైల్వే శాఖ అందించే రాయితీని గత కొన్ని నెలలుగా ఆపేసిన విషయం తెలిసిందే. కోవిడ్‌ పరిణామాల అనంతరం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఈ రాయితీని శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాయితీల వల్ల రైల్వే శాఖ పాలిట భారంగా మారుతోందని.. రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంటుకు తెలియజేసింది. రాయితీలు ఇవ్వడం దీర్ఘకాలికంగా రైల్వేపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, కరోనా తర్వాత రైల్వే తీవ్రంగా నష్టపోయిందని ఆర్టీఐ దరఖాస్తుకు రైల్వేశాఖ తెలిపింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ వికలాంగులు సహా నాలుగు కేటగిరీల వ్యక్తులకు, పేషెంట్లు, విద్యార్థుల్లాంటి 11 కేటగిరీలకు రాయితీ ఇస్తున్నాం అని రైల్వే శాఖ తెలిపింది.

ఇక రాయితీల కారణంగా ఇండియన్‌ రైల్వే ఒక్క 2019-2020లోనే ఏకంగా రూ. 64,523 కోట్లు నష్టపోయిందని రైల్వేశాఖ తెలిపింది. వీటిలో టికెట్ ధర తక్కువ ఉండడంతో పాటు ఇతర ఖర్చులతో రూ. 45,000 కోట్లు నష్టపోయినట్లు అంచనా వేశారు. మొత్తం మీద ఒక కిలోమీటర్‌కు ఒక్క ప్రయాణికుడికి 116 పైసలు ఖర్చు అయితే రైల్వే కేవలం 48 పైసలు మాత్రమే వసూలు చేస్తోందని రైల్వే శాఖ చెబుతోంది.

తక్కువ ధర ఉన్న సబర్బన్‌ సర్వీసులు టికెట్‌ కారణంగా రూ. 7000 కోట్లు, ప్రయాణికుల టికెట్ల ధరల్లో అందించే వివిధ రాయితీల కారణంగా రూ. 2000 కోట్లు, పెద్దగా ఆదాయం లేని మార్గాల్లో రైళ్లను నడపడం ద్వారా రూ. 2400 కోట్లు, పార్సల్‌, పోస్టల్‌, క్యాటరింగ్ సేవల్లో రైల్వేశాఖ రూ. 5800 కోట్లు నష్టపోయినట్లు రైల్వే శాఖ చెబుతోంది. ఇదిలా ఉంటే కోవిడ్ తర్వాత ఎత్తివేసిన కొన్ని రాయితీలను ఇండియన్ రైల్వే పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..