అవయవ దానాలకు ముందుకు రండి… ప్రజలు ప్రధాని మోదీ సూచన

ఎవరైనా చనిపోయినప్పుడు వారి అవయవాలు దానం చేస్తే ఇతరులకు మరో జన్మనిచ్చినవాళ్లవుతారు. దేశంలో చాలామంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ దీనిపై మనికీ బాత్ లో ప్రస్తావించారు.

అవయవ దానాలకు ముందుకు రండి... ప్రజలు ప్రధాని మోదీ సూచన
Pm Modi

Updated on: Mar 27, 2023 | 2:14 PM

ఎవరైనా చనిపోయినప్పుడు వారి అవయవాలు దానం చేస్తే ఇతరులకు మరో జన్మనిచ్చినవాళ్లవుతారు. దేశంలో చాలామంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ దీనిపై మనికీ బాత్ లో ప్రస్తావించారు. ప్రజలు అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే అవయవ దాన ప్రక్రియను సులభతరం చేయడానికి తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అవయవాలు అవసరమైనవారు దేశంలో ఎక్కడి నుంచైనా స్వయంగా నమోదు చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర నివాసానికి సంబంధించిన నిబంధనను తొలగించినట్లు పేర్కొన్నారు. అవయవ దానం చేసేవారి వయసు 65 ఏళ్ల లోపే ఉండాలన్న నిబంధనను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

2013లో అవయవ దానం చేసిన వారు 5 వేల లోపే ఉండగా, 2022లో వారి సంఖ్య 15 వేలకు పైనే ఉందని తెలిపారు. చనిపోయిన వ్యక్తి అవయవ దానం చేసినట్లైతే సుమారు 8 నుంచి 9 మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు.
మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశంలో వివిధ రంగాల్లో మహిళల ప్రాబల్యం పెరుగుతోందని చెప్పారు. వచ్చే నెలలో నిర్వహించనున్న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కోసం ఆలోచనలు పంచుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..