Student Suicide Case: మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య.. మళ్లీ ఆదే తంతు

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్‌ చదివే ఓ విద్యార్ధి 13వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

Student Suicide Case: మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య.. మళ్లీ ఆదే తంతు
Suicide

Updated on: Mar 16, 2023 | 4:00 PM

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్‌ చదివే ఓ విద్యార్ధి 13వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్యానా రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గురుగ్రాంలోని సెక్టార్ 41లోని సౌత్ సిటీ 1లోని రిట్రీట్ సొసైటీలో 17 ఏళ్ల బాలుడు ఓ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నాడు. ఫైనల్‌ టర్మ్‌ పరీక్షలు దగ్గరపడుతుండటంతో ఒత్తిడి తట్టుకోలేక తమ అపార్ట్‌మెంట్‌లో 13వ అంతస్థు బాల్కనీ నుంచి కింది దూకాడు. కింద ఏదోపడ్డ శబ్ధం రావడంతో సొసైటీ సెక్యూరిటీ గార్డులు బయటికి వచ్చి చూశారు. అక్కడ రక్తపుమడుగులో పడి ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యంకాకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.