నేడు లోక్‌సభ ముందుకు ప్రతిష్టాత్మక బిల్లు.. అడ్డుకుంటామంటున్న విపక్షాలు

| Edited By: Srinu

Dec 09, 2019 | 2:24 PM

మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న.. ఎన్నార్సీ సవరణ బిల్లు (పౌరసత్వ సవరణ బిల్లు) ఇవాళ పార్లమెంట్ ముందుకు రానుంది. లోక్‌సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఎన్నార్సీ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్‌లో పౌరసత్వ సవరణ బిల్లును లిస్ట్ చేసింది ప్రభుత్వం. 1955లో రూపొందించిన ఈ ఎన్నార్సీ బిల్లుకు సవరణలు చేసిన కేంద్రం.. ఉభయ సభల్లో ఈ బిల్లును పాస్ చేయించుకోవాలని చూస్తోంది. తాజా సవరణల ప్రకారం.. ముస్లింలు మినహా బంగ్లాదేశ్, […]

నేడు లోక్‌సభ ముందుకు ప్రతిష్టాత్మక బిల్లు.. అడ్డుకుంటామంటున్న విపక్షాలు
Follow us on

మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న.. ఎన్నార్సీ సవరణ బిల్లు (పౌరసత్వ సవరణ బిల్లు) ఇవాళ పార్లమెంట్ ముందుకు రానుంది. లోక్‌సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఎన్నార్సీ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్‌లో పౌరసత్వ సవరణ బిల్లును లిస్ట్ చేసింది ప్రభుత్వం. 1955లో రూపొందించిన ఈ ఎన్నార్సీ బిల్లుకు సవరణలు చేసిన కేంద్రం.. ఉభయ సభల్లో ఈ బిల్లును పాస్ చేయించుకోవాలని చూస్తోంది. తాజా సవరణల ప్రకారం.. ముస్లింలు మినహా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల నుంచి వలస వచ్చిన.. ముస్లిమేతరులందరికీ (హిందువులు, బౌద్ధులు, జైనులు క్రైస్తవులు, పార్శీలు).. భారతీయ పౌరసత్వం కల్పించేందుకు వీలు కల్పించారు.

కాగా, ఈ ఎన్నార్సీ సవరణ బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సవరణ బిల్లులో ముస్లింలను చేర్చకపోవడం పలు వివాదాలకు కేరాఫ్‌గా మారింది. ఇది లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.