బీహార్ లో లోక్ జన శక్తి పార్టీ జాతీయ అధ్యక్షునిగా చిరాగ్ పాశ్వాన్ ని తొలగించారు. ఆయనపై 5 గురు ఎంపీలు తిరుగుబాటు చేసిన రెండు రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇక చిరాగ్ బాబాయి (అంకుల్) పశుపతి కుమార్ పరాస్ నే పార్టీ చీఫ్ గా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లోక్ సభలో ఈయనను తమ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న నియమాన్ని అనుసరించి చిరాగ్ పాశ్వాన్ ని తొలగించినట్టు ఈ పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ గా సూరజ్ భాన్ ను ఎంపిక చేశారు. ఆయన పార్టీ ఎలెక్షన్ అధికారిగా కూడా వ్యవహరిస్తారు. పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక కోసం పార్టీ జాతీయ కార్యవర్గాన్ని సమావేశపరిచి.. ఆ మీటింగ్ లో నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే బాధ్యతను ఈయనపై పెట్టారు. మరికొన్ని రోజుల్లో పశుపతి ఈ పదవిని చేపట్టవచ్చు. తిరుగుబాటుపై ఇప్పటివరకు స్పందించని చిరాగ్ పాశ్వాన్.. పార్టీని సమైక్యంగా ఉంచాలని పశుపతిని కోరుతూ దివంగతుడైన తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ లోగడ రాసిన ఓ పాత లేఖను ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. నిన్న ఈయన పశుపతితో రాజీకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
కాగా సభలో లోక్ జన శక్తి పార్టీ నేతగా పశుపతిని గుర్తిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇలా ఉండగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ని పశుపతి ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనను వికాస పురుషునిగా అభివర్ణించారు. లోక్ జనశక్తి పార్టీని తాను పడగొట్టలేదని, దీన్ని రక్షించానని ఆయన చెప్పుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.
Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.
Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.
యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.