India vs China: భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. అసలు రహస్యం ఇదీ అంటున్న విశ్లేషకులు..!

India vs China: భారత్‌తో గిల్లి కయ్యాలు పెట్టుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. అయితే దానికి ఓ ముఖ్యమైన కారణం ఉందని చెబుతున్నారు దౌత్యవేత్తలు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

India vs China: భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. అసలు రహస్యం ఇదీ అంటున్న విశ్లేషకులు..!

Updated on: Jan 07, 2022 | 7:17 AM

India vs China: భారత్‌తో గిల్లి కయ్యాలు పెట్టుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. అయితే దానికి ఓ ముఖ్యమైన కారణం ఉందని చెబుతున్నారు దౌత్యవేత్తలు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకెళితే.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఈ ఏడాది చాలా ముఖ్యమైందని అంటున్నారు విదేశి వ్యవహారాల నిపుణులు. ఈ సంవత్సరం జిన్‌పింగ్ మూడోసారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. గతేడాది నవంబర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా వందేళ్లు పూర్తి చేసుకుంది. అప్పుడు ప్రభుత్వాన్ని నడిపేందుకు విధించిన రెండు పదవీ కాలాల పరిమితిని ముగించింది. దీంతో పాటు సెంట్రల్ మిలటరీ కమిషన్ పగ్గాలను కూడా జిన్‌పింగ్‌కు అప్పగించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో జిన్‌పింగ్‌కు మూడోసారి గెలిచేందుకు మార్గం సులభమైందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

అయితే, దీనికి భారత్‌కు సంబంధం ఉందనే చర్చ జరుగుతోంది. ఈసారి జిన్‌పింగ్ గెలవడం అంత ఈజీ కాదని టాక్ నడుస్తోంది. చైనాలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌తో కయ్యాలు పెట్టుకోవడం కారణంగా, దేశంలో తన పరపతి పెంచుకోవాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ దేశా ప్రజలలో జాతిభావం పెంచి, లాభపడాలని జిన్‌పింగ్ చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. భారత్‌తో వైరం సృష్టించడంతో లబ్ధిపొందాలని ప్రయత్నాలు ప్రారంభించినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విదేశీ వ్యవహారాల నిపుణులు. అందుకే పాంగ్యాంగ్ సరస్సుపై వంతెన నిర్మించడం, గల్వాన్ లోయలో జెండా ఎగురవేయడం వంటి పనులు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఇవన్నీ గ్రహించే భారత్ సమయానుకూలంగా స్పందిస్తోందని అంటున్నారు భారత దౌత్యవేత్తలు. అనవసరంగా రియాక్ట్‌ అయితే, భారత్‌ను బూచీగా చూపి జిన్‌పింగ్‌ లాభపడే ఛాన్స్‌ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా చైనా చర్యలను నిశితంగా గమనిస్తోందని, టైం వచ్చినప్పుడు ధీటుగా బదులిస్తుందని అంటున్నారు అధికారులు.

Also read:

IND vs SA: విజయంతో కొత్త ఏడాదికి వెల్‌కం చెప్పిన దక్షిణాఫ్రికా.. భారత్‌ ఓటమితో వాండరర్స్‌లో రికార్డుల వర్షం..!

IPL 2022: ఐపీఎల్ 2022లో కీలక మార్పులు.. కరోనా ఫీక్స్‌లో ఉన్నా ‘ప్లాన్ బి’తో సిద్ధమంటోన్న బీసీసీఐ..!

Silver Price Today: వెండి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన సిల్వర్‌ ధర..!