10 మంది సైనికులను విడిచిపెట్టిన చైనా

| Edited By: Pardhasaradhi Peri

Jun 19, 2020 | 2:05 PM

గల్వాన్ లోయలో భీకర ఘర్షణ సమయంలో పది మంది భారత సైనికులను అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం వారిని విడిచిపెట్టింది.

10 మంది సైనికులను విడిచిపెట్టిన చైనా
Follow us on

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల (జూన్ 15) గల్వాన్ ఘటనలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని 20 మంది జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. అదే సమయంలో పది మంది సైనికులను అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం వారిని విడిచిపెట్టింది.

అయితే.. భీకర ఘర్షణ చోటు చేసుకున్న ప్రాంతం వద్దే భారత్-చైనా మధ్య మేజర్ జనరల్ స్థాయి అధికారులు సమావేశం అయ్యారు. తొలి రోజు జరగిన చర్చలు సక్సెస్ కాకపోవటంతో… గురువారం కూడా మరోసారి చర్చలు జరిగాయి. ఇందులో మన సైనికులను విడిచిపెట్టేందుకు అంగీకరించారు.

గల్వాన్ ఘటనలో అమరులైనవారిలో ఓ లెఫ్టినెంట్‌ కల్నల్, ముగ్గురు మేజర్లు కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన ఘర్షణలో మొత్తం 76 మంది భారత సైనికులు గాయాలపాలైన విషయం తెలిసిందే. వారిలో చాలా మంది ఇప్పటికే కోలుకున్నారు.