ఇండియా బోర్డర్లో 60 వేలమంది చైనా సోల్జర్స్, మైక్ పాంపియో

భారత సరిహద్దుల్లో 60 వేలమంది చైనా సైనికులు మోహరించి ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. చైనా దేశానిది ‘బ్యాడ్ బిహేవియర్’ అని ఆరోపించారు. ఇండో-పసిఫిక్ దేశాల విదేశాంగ మంత్రులతో కూడిన కూటమిని ‘క్వాడ్’ గ్రూప్ అని వ్యవహరిస్తున్నారు. ఈ కూటమిలో ఇండియాతో బాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇటీవల టోక్యోలో జరిగిన ఈ కూటమి సమావేశంలో మాట్లాడిన మైక్.. భారత సైనికులు తమ తూర్పు సరిహద్దుల్లో ఇన్ని వేలమంది చైనా […]

ఇండియా బోర్డర్లో 60 వేలమంది చైనా సోల్జర్స్, మైక్ పాంపియో

Edited By:

Updated on: Oct 10, 2020 | 12:43 PM

భారత సరిహద్దుల్లో 60 వేలమంది చైనా సైనికులు మోహరించి ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. చైనా దేశానిది ‘బ్యాడ్ బిహేవియర్’ అని ఆరోపించారు. ఇండో-పసిఫిక్ దేశాల విదేశాంగ మంత్రులతో కూడిన కూటమిని ‘క్వాడ్’ గ్రూప్ అని వ్యవహరిస్తున్నారు. ఈ కూటమిలో ఇండియాతో బాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇటీవల టోక్యోలో జరిగిన ఈ కూటమి సమావేశంలో మాట్లాడిన మైక్.. భారత సైనికులు తమ తూర్పు సరిహద్దుల్లో ఇన్ని వేలమంది చైనా సైనికులను చూశారని తెలిపారు. అక్కడ చైనా తాత్కాలిక నిర్మాణాలను కూడా వారు గమనించారని, సౌత్ చైనా సీ వద్ద కూడా చైనా ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తోందని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో కొన్ని దీవులను చైనా ఆక్రమించుకుందని మైక్ పాంపియో చెప్పారు. తాము ఎప్పటికప్పుడు ఆ దేశ కదలికలను గమనిస్తున్నామన్నారు.

ఇండియా సంయమనంతో వ్యవహరిస్తున్నప్పటికీ పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీ  రెచ్ఛగొడుతోందని ఆయన దుయ్యబట్టారు.