CM MAMATA PROTEST: బెంగల్ రచ్చ ..ఓ వైపు ప్రధాని మోదీ ప్రచార సభ.. మరో వైపు సీఎం మమత నిరసన ర్యాలీ..

|

Mar 07, 2021 | 4:22 PM

కోల్‌కతాలో ప్రధాన మోదీ సభకు కౌంటర్‌గా సిలిగురిలో పాదయాత్ర నిర్వహించారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. గ్యాస్‌, పెట్రోధరల పెంపుకు నిరసనగా వినూత్నంగా ర్యాలీ..

CM MAMATA PROTEST: బెంగల్ రచ్చ ..ఓ వైపు ప్రధాని మోదీ ప్రచార సభ.. మరో వైపు సీఎం మమత నిరసన ర్యాలీ..
Follow us on

CM MAMATA PROTEST: కోల్‌కతాలో ప్రధాన మోదీ సభకు కౌంటర్‌గా సిలిగురిలో పాదయాత్ర నిర్వహించారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ. గ్యాస్‌, పెట్రోధరల పెంపుకు నిరసనగా వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. గ్యాస్‌బండతో ర్యాలీలో పాల్గొన్నారు మమత. తృణమూల్‌ ఎంపీలు నుస్రత్‌ జహాన్‌ కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు. గ్యాస్‌ , పెట్రో ధరలను పెంచి దేశ ప్రజలను బీజేపీ దోచుకుంటోందని విమర్శించారు మమత.

మమతతో పాటు గ్యాస్‌ ధరల పెంపుకు నిరసనగా వందలాదిమంది మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. త్వరలో ఎల్‌పీజీ సిలిండర్‌ను మోదీ ప్రభుత్వం సామాన్యులకు దూరం చేస్తుందని హెచ్చరించారు మమత. గ్యాస్‌ ధర పెంపుతో మహిళల పైనే ఎక్కువ భారం పడిందని అన్నారు. మహిళలకు బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు మమత. గ్యాస్‌, పెట్రో ధరలను పెంచిన బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌ ఎన్నికల కోసం అబద్దపు హామీలను ఇస్తోందని మండిపడ్డారు. అధిక ధరలతో దేశ ప్రజలు అల్లాడిపోతుంటే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో వుండడం సిగ్గుచేటని విమర్శించారు. అధికధరలపై మోదీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు మమత.

ఇవి కూడా చదవండి

IPL 2021 Schedule: ఐపీఎల్ సీజన్ వచ్చేసింది.. ఏప్రిల్ 9 నుంచి క్రికెట్ పండుగే… షెడ్యూల్​ను ప్రకటించిన బీసీసీఐ..

Araku Bus Accident: అరకు బస్‌ ప్రమాదంలో నిగ్గు తేలిన నిజాలు.. తీగలాగితే దిమ్మతిరిగే వాస్తవాలు..