Parliament: రేపటినుంచి పార్లమెంట్ రెండో విడత సమావేశాలు.. పలు బిల్లుల ఆమోదంపై కేంద్రం దృష్టి
Parliament budget session 2021: పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి కోవిడ్ నిబంధనలతో రెండో విడత సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రాష్ట్రాల్లో..
Parliament budget session 2021: పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి కోవిడ్ నిబంధనలతో రెండో విడత సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతోపాటు.. పలు బిల్లులకు ఆమోదం తెలపనుంది. జనవరి 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021-22 ను ప్రవేశపెట్టారు. అనంతరం పార్లమెంట్‌లో రాష్ట్రపతికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలపై, రైతుల సమస్యలపై కేంద్రం వైఖరిని తెలియజేయాలని కోరుతూ విపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. అనంతరం పార్లమెంట్ మొదటి విడుద సమావేశాలు 29న ముగిశాయి. ఉభయ సభలను మార్చి 8కి వాయిదా వేస్తూ రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ వెల్లడించారు.
ఈనేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు రాజ్యసభ జరగనుంది. లోక్‌సభ సాయంత్రం 4 నుంచి 10 గంటల వరకు జరగనుంది. ఈ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8 తో ముగుస్తాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయితే తొలి విడత సమావేశాల్లో మొత్తం మూడు బిల్లులకు సభ్యులు ఆమోద ముద్రవేశారు. ఈ రెండో విడత సమావేశాల్లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లు, క్రిప్టో కరెన్సీ అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు నియంత్రణ వంటి బిల్లులను ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతోపాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారంపై దృష్టి సారించాలని అన్ని పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో కేంద్ర పలు బిల్లులను ఆమోదించి ఎన్నికల్లో సత్తాచాటేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
Also Read: