
Fake Twitter Account: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పేరుతోనే కొందరు నకిలీ ట్విట్టర్ ఖాతా సృష్టించి తప్పుడు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇలా తప్పుడు సందేశాలు పోస్ట్ చేయడాన్ని గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా శనివారం ప్రమాణం చేసిన ఎన్వీ రమణకు సోషల్ మీడియా తదితర ప్లాట్‌ఫాంలల్లో ఎలాంటి ఖాతాలు లేవు. అయితే @NVRamana పేరుతో ట్విట్టర్‌లో ఒక నకిలీ ఖాతా ఉంది. ఇప్పటివరకు దీనిలో 98 ఫేక్ పోస్టులు షేర్ చేశారు. అయితే ట్విట్టర్ హ్యాండిల్‌ను 5,859 మంది ఫాలో అవుతున్నారు. నిన్న ఇదే ట్విట్టర్ ఖాతాలో “అజిత్ డోవల్ దౌత్యం కారణంగా, భారతదేశానికి ఔషధ ముడి పదార్థాలను సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది #vaccination @PMOIndia.. అని తాజాగా ఫేక్ ట్వీట్ చేసి అనంతరం డిలీట్ చేశారు. ఇది జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Nv Ramana Fake Twitter Account
కాగా.. భారత 48 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ 24న రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయన ఆగస్టు 26, 2022 వరకు భారత అత్యున్నత న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి భారత రెండవ ప్రధాన న్యాయమూర్తిగా అంచెలంచెలుగా ఎదిగారు. అంతకుముందు జస్టిస్ కె సుబ్బారావు 1966-67 వరకు భారత తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.
Also Read: