అంతదానికే ఇంత దారుణమా.. ప్రియురాలిని 51సార్లు స్క్రూడ్రైవర్​తో పొడిచి హత్య.. కారణం తెలిస్తే..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన ప్రియురాలు మరో యువకుడితో మాట్లాడుతుందనే అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత 51 సార్లు స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను హత్య చేశాడు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో తాజాగా కోర్టు నిందితుడికి జీవిఖైదు విధించడంతో ఈ ఘటన మరోసారి తెరపైకి వచ్చింది.

అంతదానికే ఇంత దారుణమా.. ప్రియురాలిని 51సార్లు స్క్రూడ్రైవర్​తో పొడిచి హత్య.. కారణం తెలిస్తే..
Crime News

Updated on: Sep 23, 2025 | 10:05 PM

తన ప్రియురాలు మరో యువకుడితో మాట్లాడుతుందనే అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా 51 సార్లు స్క్రూడ్రైవర్‌తో పొడిచి హత్య చేసిన కేసులో ఒక యువకుడికి కోర్టు జీవితఖైదు విధించిన ఘటన చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కోర్బా నగరంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పంప్ హౌస్ కాలనీలో నివాసం ఉంటున్న బాధితురాలు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఆమె స్కూల్‌ చదువుకునే రోజుల్లో ఆమె రోజూ బస్సులో స్కూల్‌కు వెళ్లేది. ఆ సమయంలో ఆమెతో బస్సు కండక్టర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం స్టార్ట్‌ చేశారు.

దీంతో వీరిద్ధరి మధ్య బంధం గట్టిపడి అది ప్రేమగా మారింది. అయితే కొన్ని రోజుల తర్వాత సదురు యువకుడు యువతిని అనుమానించడం స్టార్ట్‌ చేశాడు. ఆమె వేరే వ్యక్తితో ఫోన్‌ మాట్లాడుతుందని, అదే విషయాన్ని ఆమె తల్లితో చెప్పాడు. ఇక అప్పటి నుంచి అతను ఆ యువతిని వేధించడం స్టార్ట్‌ చేశాడు. వివిధ నెంబర్‌ల నుంచి ఆమెకు కాల్‌ చేస్తూ చంపేస్తానని బెదిరిస్తూ భయాందోళనలకు గురిచేసేవాడు.

అయితే ఒక రోజు ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లడంతో యువతి ఒక్కతే ఇంట్లో ఉన్నట్టు నిందితుడు తెలుసుకున్నాడు. ఇక ఇంట్లోకి దూరి యువతిపై అత్యాచారం చేసి ఆ తర్వాత స్కూల్‌డ్రైవర్‌తో ఆమెను అతికిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడే ఇంటికి వచ్చిన బాధితురాలి సోదరుడు ఇంట్లో తన సోదరి స్పృహతప్పి పడిపోయి ఉండడం చూసి వెంటనే తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వెంటనే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు, పోలీసులు మంచంపై పడిఉన్న యవతిని పరిశీలించారు. ఆమె ముఖం, మెడ, చేతులు, ఛాతీపై చాలా చోట్ల పదునైన సూదితో గాయం చేసిన గుర్తులు కనిపించాయి. అలాగే పక్కనే కొత్త స్కూల్‌డ్రైవర్స్‌, బెడ్‌పై నిందితుడి పేరుతో ఉన్న ప్లైట్‌ టికెట్స్‌దొరికాయి. ఇక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడని అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా యువతిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కావడంతో రెండేళ్ల తర్వాత నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.