Dantewada Encounter: చత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌.. మహిళా నక్సలైట్‌ మృతి

|

Mar 23, 2023 | 4:50 PM

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు, పోలీసుల మధ్య గత వారం రోజులుగా పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి మరోమారు నక్సలైట్లు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. రైల్వే ట్రాక్‌ నిర్మాణపనుల కోసం..

Dantewada Encounter: చత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌.. మహిళా నక్సలైట్‌ మృతి
Chhattisgarh Encounter
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు, పోలీసుల మధ్య గత వారం రోజులుగా పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి మరోమారు నక్సలైట్లు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. రైల్వే ట్రాక్‌ నిర్మాణపనుల కోసం వినియోగించే జేసీబీ మెషిన్‌, ట్రక్‌ను తగులబెట్లేందుకు నక్సలైట్లు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నక్సలైట్లపై ఎన్‌కౌంటర్ జరిపారు. దంతేవాడలోని బచేలి పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో జేసీబీ యంత్రం, ట్రక్‌ పాక్షికంగా దెబ్బతిన్నాయని, ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

కాగా కాంకేర్ జిల్లాలో బస్తర్ రేంజ్ ఐజీ, కోయెలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్పరస్ గుండుల్ గ్రామ సమీపంలో మార్చి 19-20 తేదీల్లో నక్సలైట్లు తొలుత దాడులు జరిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న 12 వాహనాలను నక్సలైట్లు తగులబెట్టారు. దెబ్బతిన్న వాహనాల్లో రెండు మట్టి తరలించే యంత్రాలు, రెండు బుల్డోజర్లు, ఎనిమిది ట్రాక్టర్లు ఉన్నాయి. అంతేకాకుండా కొందరు కూలీలను నక్సలైట్లు బంధించి, ఆ తర్వాత విడుదల చేశారు. ఈ ప్రదేశంలో నక్సలైట్ల బెడద షరా మామూలేనని, ఇటువంటి ప్రదేశంలో రోడ్డు పనులు ప్రారంభించేముందు కాంట్రాక్టర్ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఆ తర్వాత బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోర్చోలి, తొడ్కా మధ్య అడవుల్లో పోలీసులు సోమవారం (మార్చి 20) ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిపారు. ఈ ఆపరేషన్‌ను బీజాపూర్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) చేపట్టింది. నక్సల్, పోలీస్‌ భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళా నక్సలైట్‌ మృతి చెందగా,12 బోర్ రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.