దారికి అడ్డంగా ఉందని గుడిసెను తొక్కేసుంటూ వెళ్ళిన ఏనుగుల గుంపు.. వృద్ధుడు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తిని ఏనుగు అక్కడికక్కడే తొక్కి చంపింది. బైకుంత్పూర్ అటవీ డివిజన్ పరిధిలోకి వచ్చే విషున్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది, శుక్రవారం (నవంబర్ 28) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు మృతుడి గుడిసెపై దాడి చేసింది. ఆ వృద్ధుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఏనుగుల దాడిలో అతను మరణించాడు.

ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తిని ఏనుగు అక్కడికక్కడే తొక్కి చంపింది. బైకుంత్పూర్ అటవీ డివిజన్ పరిధిలోకి వచ్చే విషున్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది, శుక్రవారం (నవంబర్ 28) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు మృతుడి గుడిసెపై దాడి చేసింది. ఆ వృద్ధుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఏనుగుల దాడిలో అతను మరణించాడు.
మృతుడిని బైకుత్‌పూర్ అటవీ డివిజన్ పరిధిలోకి వచ్చే విషున్‌పూర్ నివాసి 65 ఏళ్ల ఫుల్సాయి పాండోగా గుర్తించారు. ఈ విషయం గురించి అటవీ విభాగం రేంజర్ అజిత్ సింగ్ మాట్లాడుతూ, రాత్రిపూట ఏనుగుల గుంపులు ఆహారం కోసం బయటకు వెళ్తాయని, ఈ క్రమంలోనే రాత్రి ఏనుగుల గుంపు కూడా బయటకు వచ్చిందని తెలిపారు. విషున్‌పూర్ గ్రామంలోని రైల్వే ట్రాక్ దగ్గరకు వెళుతుండగా, రైలు రావడంతో ఏనుగు దిక్కుతోచని స్థితిలో రైల్వే ట్రాక్ సమీపంలోని గుడిసెపై దాడి చేసింది.
ఫూల్సాయ్ పాండో ఈ గుడిసెలో నివసిస్తున్నాడు. ఏనుగులు వస్తున్నట్లు చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అవి అతన్ని చితకబాది చంపాయి. సంఘటన గురించి సమాచారం అందుకున్న అటవీ శాఖ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబానికి తక్షణ సహాయంగా 25,000 రూపాయలు ఇచ్చినట్లు రేంజర్ అజిత్ సింగ్ తెలిపారు. మృతుడి కుటుంబానికి మిగిలిన రూ. 5,75,000 ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే రాత్రిపూట అనవసరంగా ఇళ్లను వదిలి వెళ్లకుండా ఉండాలని, ఏనుగుల గుంపు నివాస ప్రాంతాల నుండి దూరంగా వెళ్లే వరకు ఏనుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అజిత్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన తర్వాత, ఈ ప్రాంత ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
