Anti-NEET Bill: నీట్ పరీక్షలో రెండు సార్లు ఫెయిల్‌.. తండ్రీ కొడుకుల ఆత్మహత్య..!

|

Aug 14, 2023 | 4:32 PM

తమిళనాడులో నీట్‌ను నిషేధించే బిల్లుకు ఆమోదం తెలపనందుకు గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపాదిత చట్టంపై తమ ప్రభుత్వం రెండుసార్లు అసెంబ్లీలో బిల్లును తీసుకువచ్చిందని, అయినా గవర్నర్‌ ఆమోదం తెల్పడానికి నిరాకరించారన్నారు. 'మేము నీట్‌ పరీక్ష నిషేధిత బిల్లును గవర్నర్‌కు పంపాము. మొదటి బిల్లును నిలుపుదల చేసిన గవర్నర్ ఆ తర్వాత వెనక్కి పంపారు. మళ్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపాం. గవర్నర్‌ సమ్మతి ఇవ్వకుండానే ఆయన దానిని..

Anti-NEET Bill: నీట్ పరీక్షలో రెండు సార్లు ఫెయిల్‌.. తండ్రీ కొడుకుల ఆత్మహత్య..!
NEET Student Commits Suicide
Follow us on

చెన్నై, ఆగస్టు 14: వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్షలో అర్హత సాధించలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణంను తట్టుకోలేని తండ్రి కూడా రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రీ కుమారుల వరుస ఆత్మహత్యలు ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపాయి. ఈ విషాద ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

చెన్నైలోని క్రోమ్‌పేటకు చెందిన జగదీశ్వరన్‌ (19) గతేడాది ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. అనంతరం నీట్‌కు శిక్షణ తీసుకున్నాడు. రెండు ప్రయత్నాల్లో నీట్‌ పరీక్షలో ర్యాంకు సాధించలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జగదీశ్వరన్‌ శనివారం (ఆగస్టు 12) ఇంట్లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జగదీశ్వరన్‌ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. జగదీశ్వరన్‌ ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఎటువంటి సూసైడ్ లెటర్‌ లభ్యంకాలేదు. మృతుడి తండ్రి శల్వశేఖర్‌ తన కుమారుడి మరణానికి నీట్ నిర్వహణ కారణమని ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత రెండు రోజులకే సోమవారం (ఆగస్టు 14) సెల్వశేఖర్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక సెల్వశేఖర్ కూడా మరణించడం స్థానికంగా విషాదం నింపింది. తమిళనాడులో నీట్‌ పరీక్ష ను తొలగించేందుకు తాను నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నానని సెల్వశేఖర్ చనిపోయే ముందు చెప్పారు. ఈ రెండు మరణాలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విచారం వ్యక్తం చేశారు. నీట్‌ పరీక్ష తొలగింపుకు చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.

గవర్నర్‌పై ఎంకే స్టాలిన్‌ విమర్శ దాడి..

తమిళనాడులో నీట్‌ను నిషేధించే బిల్లుకు ఆమోదం తెలపనందుకు గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపాదిత చట్టంపై తమ ప్రభుత్వం రెండుసార్లు అసెంబ్లీలో బిల్లును తీసుకువచ్చిందని, అయినా గవర్నర్‌ ఆమోదం తెల్పడానికి నిరాకరించారన్నారు. ‘మేము నీట్‌ పరీక్ష నిషేధిత బిల్లును గవర్నర్‌కు పంపాము. మొదటి బిల్లును నిలుపుదల చేసిన గవర్నర్ ఆ తర్వాత వెనక్కి పంపారు. మళ్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపాం. గవర్నర్‌ సమ్మతి ఇవ్వకుండానే ఆయన దానిని రాష్ట్రపతికి పంపారని’ ఎంకే స్టాలిన్ తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ ఇదే..

ఇక రాజ్‌భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదంగా మారిన అంశాల్లో తాజాగా నీట్ పరీక్ష కూడా చేరిపోయింది. బిల్లుపై గవర్నర్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని, అభ్యంతరం ఉన్నట్లు నటిస్తున్నారని ఎంకే స్టాలిన్ విమర్శించారు. జగదీశన్‌లా ఎంతమంది ప్రాణాలు పోయినా గవర్నర్ మనసు మారదని, చల్లని హృదయాలు మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వవని వ్యాంగ్యాస్రాలు విసిరారు. నీట్ పరీక్ష వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే రాజకీయంగా మార్పురావాలని సీఎం ఎంకే స్టాలిన్ నొక్కి చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.