పెళ్లికూతురు కాళ్లు మొక్కిన పెళ్లికొడుకు… ఇదేం చోద్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ : Viral news

పెళ్ళంటే పందిళ్ళు..సందళ్ళు..​తప్పెట్లు..తాళాలు..తలంబ్రాలూ మూడే ముళ్ళు..​ఏడే అడుగులు..మొత్తం కలిపి నూరేళ్ళు అంటారు ఆత్రేయ.. నిజమే కానీ పెళ్లిళ్లలో అంతకు మించి కూడా ఉంటాయి. కానీ కరోనా కాలంలో పెళ్లిళ్ల సందడే లేకుండా పోయింది.

పెళ్లికూతురు కాళ్లు మొక్కిన పెళ్లికొడుకు... ఇదేం చోద్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ : Viral news
Check Out Reason Why Groom Touched Brides Feet
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Jun 03, 2021 | 9:28 AM

పెళ్ళంటే పందిళ్ళు..సందళ్ళు..​తప్పెట్లు..తాళాలు..తలంబ్రాలూ మూడే ముళ్ళు..​ఏడే అడుగులు..మొత్తం కలిపి నూరేళ్ళు అంటారు ఆత్రేయ.. నిజమే కానీ పెళ్లిళ్లలో అంతకు మించి కూడా ఉంటాయి. కానీ కరోనా కాలంలో పెళ్లిళ్ల సందడే లేకుండా పోయింది. వివాహాది శుభకార్యక్రమాలకు 50 మందికి మించి హాజరవ్వకూడదని ప్రభుత్వం గట్టిగా చెప్పడంతో ఎందుకొచ్చిన తంటా అని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మేళతాళాలు లేవు, ఆకాశమంత పందిళ్లు లేవు..బారాత్‌లులేవు.. ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లిళ్ల స్వరూపమే మారిపోయింది.

ఇలాంటి సమయంలో పెళ్లి వేడుకలో వధువరూల మీద అందరి దృష్టి ఉంటుంది. వారేం చేసినా అదో ఆకర్షణ్‌ అవుతుంటుంది.. దండలు మార్చుకునే దగ్గర్నుంచి తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం వరకు అంతా అతిధులకు ఆకట్టుకునేట్టుగా ఉంటాయి. సాధారణంగా పెళ్లి తతంగంలో పెళ్లికూతరుతో చాలా సార్లు పెళ్లి కొడుకు కాళ్లు మొక్కిస్తారు..

ఎక్కడ జరిగిందో, తెలియదు కానీ ఓ పెళ్లి వేడుక మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. పెళ్లి కూతురు కాళ్లమీద పెళ్లి కొడుకే పడ్డాడు.. కాళ్లు మొక్కాడు. వధూవరులు దండ‌లు మార్చుకుంటున్న స‌మ‌యంలో వరుడు అక‌స్మాత్తుగా వధువు కాళ్ల‌ మీద ప‌డ్డాడు. ఈ తతంగాన్ని చూసి పెళ్లికి వచ్చిన బంధు మిత్రులు ఆశ్చర్యపోయారు. ఇదేం చోద్యం అంటూ ముక్కున వేలేసుకున్నారు.. అయితే తాను ఎందుకు పెళ్లికూతురు కాళ్లు మొక్కానో పెళ్లికొడుకు సవివరంగా చెప్పుకొచ్చారు. త‌న వంశాన్ని అభివృద్ధి చేయ‌డానికి మెట్టినింటికి వస్తున్నారు కాబట్టే ఆమె కాళ్ల‌కు దండం పెట్టానన్నాడు.. క‌న్న‌వాళ్ల‌ను, తోబుట్టువుల‌ను వ‌దిలి తన కోసం, తన సంతోషం కోసం మా ఇంట్లో అడుగుపెట్ట‌బోతున్న ఆమె కాళ్ల‌కు మొక్కితే త‌ప్పేముంద‌ని అడుగుతున్నాడు. నిజమే కదూ! పుట్టినింట్లో అనుభవించిన అన్నేళ్ల ప్రేమాప్యాతలను వదిలేసి మెట్టినింట అడుగుపెడుతున్నందుకు ఆమె కాళ్లు మొక్కినా తప్పులేదనంటున్నారు చాలా మంది. పెళ్లికొడుకు పెళ్లికూతరు కాళ్ల‌ మీద పడిన ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్‌లు చాలా మంది పెళ్లికొడుకు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : ఆకాశంలో మరో అద్భుతం ..ఈ సారి గంటకు పైగా వీక్షించే అవకాశం..: solar eclipse Viral Video

మోడీ జీ నా దగ్గర డబ్భులు లేవు..కేంద్రం తీరుపై ఝార్ఖండ్ సీఎం తీవ్ర అసంతృప్తి : Hemant Soren Fire video

విజయవాడ రైల్వే స్టేషన్ పై కరోనా ఎఫెక్ట్.. వెలవెలబోతున్న రైల్వే స్టేషన్లు :Andhra Pradesh Railway stations video

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.