AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Kheri Case: లఖింపూర్ ఖేరీ హింస కేసులో చార్జిషీట్ దాఖలు.. ఇది ప్రమాదం కాదు.. కుట్ర అని పేర్కొన్న సిట్

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ హింస జరిగి 90 రోజులు పూర్తయ్యాయి. ఈ కేసులో సిట్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది.

Lakhimpur Kheri Case: లఖింపూర్ ఖేరీ హింస కేసులో చార్జిషీట్ దాఖలు.. ఇది ప్రమాదం కాదు.. కుట్ర అని పేర్కొన్న సిట్
Lakhimpur Kheri Case Charge Sheet
KVD Varma
|

Updated on: Jan 03, 2022 | 5:50 PM

Share

Lakhimpur Case: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ హింస జరిగి 90 రోజులు పూర్తయ్యాయి. ఈ కేసులో సిట్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ 5000 పేజీలతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ బంధువు వీరేంద్ర కుమార్ శుక్లా పేరు చేర్చారు. వీరేంద్ర కుమార్ శుక్లాపై 201వ సెక్షన్ కింద సాక్ష్యాలను ధ్వంసం చేయడంపై అభియోగాలు నమోదు చేశారు. న్యాయస్థానం వెలుపల రైతుల తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. చార్జిషీట్‌లో మంత్రి అజయ్‌ మిశ్రా పేరును చేర్చాలని దరఖాస్తు చేసుకున్నారని, అయితే ఆయన పేరును చార్జిషీట్‌లో చేర్చలేదని అన్నారు.

అక్టోబర్ 3న లఖింపూర్‌లోని తుకానియాలో జర్నలిస్టుతో సహా 8 మంది చనిపోయారు. ఈ సందర్భంగా ఇరువర్గాల నుంచి కేసు నమోదైంది. దీనిపై ఉత్తరప్రదేశ్ సిట్ విచారణ జరుపుతోంది. ఈ కేసులో మంత్రి అజయ్ మిశ్రా టెన్ని కుమారుడు ఆశిష్ మిశ్రా మోను సహా 13 మంది జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ జనవరి 6న విచారణకు రానుంది.

టికోనియా హింస కేసులో రైతుల తరపు న్యాయవాది అమన్‌ మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్‌ 201 కూడా చేర్చినట్లు తెలిపారు. అలాగే వీరేంద్ర కుమార్ శుక్లా పేరు కూడా జత చేసారని చెప్పారు అయితే, మంత్రి పేరు కూడా చేర్చాలని కోరగా ఆయన పేరును చార్జిషీట్ లో చేర్చలేదని వెల్లడించారు.

ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారం జరిగిన కుట్ర అని సిట్ చార్జిషీట్ లో పేర్కొంది. ఈ కేసులో నిందితులపై ఉన్న సెక్షన్లను మార్చాలని కోర్టును అభ్యర్థించారు. భవిష్యత్తులోనూ ఇదే సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు.

మోటారు వెహికల్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద..

ఆశిష్ మిశ్రా మోను .. సహచరుడు నందన్ సింగ్‌పై ఆరోపణలు 177 (మోటార్ వెహికల్ యాక్ట్) .. 5/25 (ఆయుధాల చట్టం) కింద అభియోగాలు మోపారు . ఇప్పటి వరకు నిందితులకు చార్జిషీట్‌ చూపించలేదు. ఛార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకున్న వెంటనే, సెక్షన్ 309 కింద నిందితులందరినీ కోర్టుకు పిలిపించి, చార్జ్ షీట్ కాపీని అందజేస్తారు.

హింసలో ఎనిమిది మంది మరణించారు,

గత అక్టోబర్ 3 న లఖింపూర్‌లో జరిగిన సంఘటనలో నలుగురు రైతులు, స్థానిక జర్నలిస్ట్ సహా ఎనిమిది మంది మరణించారు. ఆశిష్ మిశ్రా .. అతని సహచరులు కాల్పులు జరుపుతూ రైతులను తమ కారుతో తొక్కించారని ఆరోపించారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబర్ 4న టికునియా పోలీస్ స్టేషన్‌లో ఆశిష్ మిశ్రాతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం సిట్ విచారణలో ఇది ప్రమాదం కాదని, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని తేలింది.

ఇవి కూడా చదవండి: Deepthi Sunaina: లైవ్‌లో కన్నీళ్లు పెట్టిన దీప్తి.. హృదయం ముక్కలైన ఎమోజీలు పెట్టిన షణ్ముక్

Railway Jobs: నార్తర్న్‌ రైల్వేలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్‌ కోటాలో అభ్యర్థుల ఎంపిక.. ఇలా దరఖాస్తు చేసుకోండి..